For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.500కు పైగా తగ్గిన బంగారం ధర, రూ.50వేల దిగువకు: మరింత కాలం అస్థిరంగా..

|

బంగారం ధరలు వరుసగా తగ్గుతున్నాయి. ఈ వారం ప్రారంభం నుండి పుత్తడి ధరలు క్షీణిస్తున్నాయి. ఈ రోజు (సెప్టెంబర్ 24, గురువారం) మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో 10 గ్రాముల పసిడి ఫ్యూచర్ సాయంత్రం సెషన్ వరకు రూ.49,572 నుండి రూ.49,248 మధ్య ట్రేడ్ అయింది.సాయంత్రం సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ అక్టోబర్ డెలివరీ రూ.49,480 పలికింది. బిజినెస్ టర్నోవర్ 6,017 లాట్లుగా ఉంది. డిసెంబర్ ఫ్యూచర్స్ రూ.49,568 పలికింది. బిజినెస్ టర్నోవర్ 12,159 లాట్లుగా ఉంది. అక్టోబర్, డిసెంబర్ కాంట్రాక్ట్ వ్యాల్యూ వరుసగా రూ.3,769.84, రూ.806.67 కోట్లుగా ఉంది. గోల్డ్ మినీ కాంట్రాక్ట్ అక్టోబర్ రూ.49,537 పలికింది. బిజినెస్ టర్నోవర్ 10,037 లాట్లుగా ఉంది.

బులియన్ మార్కెట్లో రూ.500 తగ్గుదల

బులియన్ మార్కెట్లో రూ.500 తగ్గుదల

దేశ రాజధాని న్యూఢిల్లీలో ఈ రోజు 10 గ్రాముల మేలిమి బంగారం రూ.500 వరకు క్షీణించి రూ.50,418 పలికింది. అంతకుముందు సెషన్‌లో రూ.50,900కు చేరుకుంది. ఈ రోజు మరింతగా క్షీణించింది. కిలో వెండి ధర రూ.2,000కు పైగా క్షీణించి రూ.58,099 పలికింది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.53,200 పైన పలికింది. 22 క్యారెట్ల పసిడి రూ.48,800కు దిగి వచ్చింది. ముంబై మార్కెట్లో రూ.500కు పైగా క్షీణించి రూ.49,822 పలికింది. బంగారం ధరలు వరుసగా నాలుగు రోజులుగా క్షీణిస్తున్నాయి. ఈ నాలుగు రోజుల్లో దాదాపు రూ.3000 తగ్గాయి.

భారీగా తగ్గాయి.. మరింత కాలం అస్థిరంగా..

భారీగా తగ్గాయి.. మరింత కాలం అస్థిరంగా..

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఔన్స్ 1854 డాలర్లకు దిగి వచ్చింది. వెండి 22.12 డాలర్లకు దిగి వచ్చింది. గత నెలలో పసిడి 2075 డాలర్ల పైకి చేరుకుంది. ఆ ధరతో పోలిస్తే 200 డాలర్లకు పైగా క్షీణించింది. స్పాట్ గోల్డ్ 1856 డాలర్లకు పడిపోయింది. కరోనా నేపథ్యంలో ఈ కొద్ది రోజుల్లోనే పసిడి 600 డాలర్ల మధ్య పైకి, కిందకు కదిలింది. కరోనా కేసులు పెరుగుతుండటం, ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో రానున్న కొద్ది రోజులు బంగారం ధరల్లో అస్థిరత నెలకొంటుందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

అందుకే 1900 డాలర్ల దిగువకు

అందుకే 1900 డాలర్ల దిగువకు

ఈ వారం బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ 1825- 1890 డాలర్ల మధ్య నిలదొక్కుకోవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. దేశీయ మార్కెట్లో రూ.49,000 నుండి రూ.50,000 దిగువన ఉంటుందని అంచనా. ఓ వైపు కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ, డాలర్ బలపడుతుండటంతో బంగారంపై ఒత్తిడి తగ్గుతోంది. దీంతో చాలా రోజులకు 1900 డాలర్ల దిగువకు చేరుకుంది.

English summary

రూ.500కు పైగా తగ్గిన బంగారం ధర, రూ.50వేల దిగువకు: మరింత కాలం అస్థిరంగా.. | Gold Prices Today: Yellow metal declines below $1,900

Gold prices weakened for the fourth successive day by Rs 505 to Rs 49,822 per 10 gram in the Mumbai retail market on firm US dollar and sell-off in equity markets. The precious metal is volatile today after a sharp 2.1 percent decline yesterday.
Story first published: Thursday, September 24, 2020, 21:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X