For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold Prices Today: రూ.50,000 దిగువకు పడిపోయిన పసిడి ధరలు

|

బంగారం ధరలు చివరి సెషన్‌లో క్షీణించాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX) శని, ఆదివారం సందర్భంగా నిన్న, నేడు సెలవు. గోల్డ్ ఫ్యూచర్స్ చివరి సెషన్ (శుక్రవారం)లో రూ.50,000 దిగువకు వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో నేటి సెషన్‌లో 1810 డాలర్ల వద్ద ముగిసింది. ఎంసీఎక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ రూ.60,000 దిగువన క్లోజ్ కాగా, కామెక్స్‌లో 21.200 డాలర్ల దిగువకు పడిపోయింది.

జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో రూ.265 క్షీణించి రూ.49,909 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.335 తగ్గి రూ.50,078 వద్ద ముగిసింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో రూ.631 పెరిగి రూ.59,382 వద్ద ముగిసినప్పటికీ, అంతకుముందు సెషన్‌లో రూ.59,000 దిగువకు పడిపోయింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.591 పెరిగి రూ.60,073 వద్ద ముగిసింది.

Gold Prices Today: Yellow metal below RS 50,000

అంతర్జాతీయ మార్కెట్లో చివరి సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 14.30 డాలర్లు క్షీణించి 1810 డాలర్ల వద్ద ముగిసింది. అంతకుముందు సెషన్‌లో 1824 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో 0.75 శాతం క్షీణించింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.352 డాలర్లు పెరిగి 21.125 డాలర్ల వద్ద ముగిసింది. క్రితం సెషన్‌లో 20.773 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో 21.93 డాలర్ల మేర క్షీణించింది.

English summary

Gold Prices Today: రూ.50,000 దిగువకు పడిపోయిన పసిడి ధరలు | Gold Prices Today: Yellow metal below RS 50,000

Gold price in India has remained the same on May 15, 2022. Today, gold price in India for 24 carat gold is Rs 50,460 while 22 carat gold cost Rs 46,230
Story first published: Sunday, May 15, 2022, 17:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X