Gold Prices Today: రూ.53,000 దిగువకు బంగారం ధరలు, కానీ...
బంగారం ధరలు క్రితం సెషన్‌లో అతి స్వల్పంగా క్షీణించాయి. అంతకుముందు సెషన్‌లో రూ.53,000 క్రాస్ చేసిన గోల్డ్ ఫ్యూచర్స్, క్రితం సెషన్‌లో ఈ స్థాయి దిగువకు వచ్చినప్పటికీ, అతి స్వల్పంగా మాత్రమే తగ్గాయి. జూన్ గోల్డ్ ఫ్యూచర్సస్ క్రితం సెషన్‌లో రూ.90 క్షీణించి రూ.52,991 వద్ద ముగిసింది. అంతకుముందు సెషన్‌లో రూ.53,000కు పైన ముగిసింది. నిన్నటి సెషన్‌లో ఓ సమయంలో రూ.53,110 వద్ద గరిష్టాన్ని తాకింది. కానీ చివరకు స్వల్ప నష్టంతో ముగిసింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.34 ఎగిసి రూ.53,230 వద్ద ముగిసింది.
సిల్వర్ ఫ్యూచర్స్ రూ.70,000ను సమీపించింది. అయితే చివరకు రూ.69,000కు కాస్త పైన ముగిసింది. మే సిల్వర్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో రూ.366 నష్టపోయి రూ.69,100 వద్ద ముగిసింది. అంతకుముందు సెషన్‌లో రూ.69,500కు సమీపంలో ముగిసింది. జూలై గోల్డ్ ఫ్యూచర్స్ రూ.397 ఎగిసి రూ.69,760 వద్ద ముగిసింది.

అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్ కామెక్స్‌లోను బంగారం ధరలు కాస్త తగ్గాయి. ఓ సమయంలో 2000 డాలర్ల దిశగా పరుగు పెట్టింది. నిన్నటి సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1985 డాలర్ల వద్ద ముగిసింది. చివరి సెషన్‌లో మాత్రం 12 డాలర్లకు పైగా నష్టపోయి 1972 డాలర్ల వద్ద ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ మే కూడా 0.0005 డాలర్లు క్షీణించి 25.855 డాలర్ల వద్ద ముగిసింది.


Click it and Unblock the Notifications