వరుసగా పెరుగుతున్న ధరలు... బంగారం ఆల్‌టైం గరిష్టంతో రూ.6200 డౌన్
ముంబై: దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం ధరలు రూ.50వేలను క్రాస్ చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి 1870 డాలర్లను దాటింది. అంతకుముందు వారం వరకు తగ్గిన బంగారం ధరలు, గతవారం రోజులుగా పెరుగుతున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో 10 గ్రాముల ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.119.00 (0.24%) పెరిగి రూ.50065.00 పలికాయి. రూ.50,065.00 వద్ద ప్రారంభమై, రూ.50,175.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.50,045 వద్ద కనిష్టాన్ని తాకాయి.

గోల్డ్ ఫ్యూచర్స్ ధర రూ.6200 డౌన్
ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.166.00 (0.33%) పెరిగి రూ.50,180.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,120.00 వద్ద ప్రారంభమై, రూ.50,264.00 గరిష్టాన్ని, రూ.50,120.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే గోల్డ్ ఫ్యూచర్స్ రూ.6200 వరకు తక్కువగా ఉంది.

సిల్వర్ ఫ్యూచర్స్ డౌన్
సిల్వర్ ఫ్యూచర్స్ స్వల్పంగా తగ్గింది. కిలో మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.20.00 (-0.03%) క్షీణించి రూ.65,479.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.65,388.00 వద్ద ప్రారంభమై, రూ.65,666.00 వద్ద గరిష్టాన్ని, రూ.65,363.00 కనిష్టాన్ని తాకింది.సిల్వర్ మే ఫ్యూచర్స్ రూ.119.00 (-0.18%) క్షీణించి రూ.66217.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.66,227.00 వద్ద ప్రారంభమై, రూ.66,505.00 గరిష్టాన్ని, రూ.66,217.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 5.80 (+0.31%) డాలర్లు పెరిగి 1,871.80 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,864.85 - 1,875.95 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 1,866.00 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. ఏడాదిలో 25.36 శాతం పెరిగింది.
సిల్వర్ ఫ్యూచర్స్ 0.047 (-0.19%) క్షీణించి 24.747 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 24.640 - 24.902 మధ్య ట్రేడ్ అయింది. ఏడాదిలో 48.82 శాతం పెరిగిన వెండి, అంతకుముందు సెషన్లో 24.794 శాతం పెరిగింది.


Click it and Unblock the Notifications