బంగారం ధరలు బుధవారం (ఫిబ్రవరి 24) స్వల్పంగా తగ్గాయి. బంగారం మద్దతు ధర రూ.46,550-రూ.46,400, నిరోధకస్థాయి రూ.47050-రూ.47220. బంగారాన్ని రూ.46,700 వద్ద రూ.46,480 స్టాప్ లాస్‌తో కొనుగోలు చేయవచ్చునని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. యూఎస్ బాండ్ ఈల్డ్స్ పదేళ్ల గరిష్టానికి చేరుకోవడంతో పసిడి, వెండి ధరలు ఒత్తిడికి లోనయ్యాయి. ఇక వెండి మద్దతు ధర రూ.68800-రూ.68300, నిరోధకస్థాయి రూ.69900-రూ.70600. బంగారం ధర ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో ఇప్పటికీ రూ.9500 తక్కువగా ఉంది. పసిడి ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి.

రూ.47,000 దిగువ బంగారం
ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో బంగారం ధర నేడు ప్రారంభ సెషన్లో స్వల్పంగా తగ్గింది. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ ఉదయం సెషన్లో రూ.58.00 (-0.12%) తగ్గి రూ.46,744.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,808.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.46,857.00 వద్ద గరిష్టాన్ని, రూ.46,701.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.9,500 వరకు తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.80.00 (-0.17%) తగ్గి రూ.46,860 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,925.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.46,940.00 వద్ద గరిష్టాన్ని, రూ.46,841.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి ధరలు స్థిరంగా
వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.63.00 (0.09%) తగ్గి రూ.69,278.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,611.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.69,673.00 వద్ద గరిష్టాన్ని, రూ.68,270.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మే సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.62.00 (0.09%) క్షీణించి రూ.70,559.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.70,868.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.70,938.00 వద్ద గరిష్టాన్ని, రూ.70,218.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో పైపైకి..
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు నేడు పెరిగాయి. నిన్ననే 1800.00 డాలర్ల పైకి చేరుకున్న పసిడి, నేడు మరింత ఎగిసింది. ఉదయం సెషన్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 1.20 (+0.07%) డాలర్లు పెరిగి 1807.10 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,804.45 - 1,812.80 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 6.62 శాతం తగ్గింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. ఔన్స్ ధర 0.047 (+0.17%) డాలర్లు పెరిగి 27.735 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 27.550 - 27.995 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

Silver: వెండి ధర కిలో రూ.2 లక్షల కంటే కిందకు పడిపోదా? నిపుణులు ఏమంటున్నారు?



Click it and Unblock the Notifications