బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?: అక్కడ మాత్రం భారీగా డౌన్, కారణమిదే...
అంతర్జాతీయ మార్కెట్లో గతవారం 1900 డాలర్ల పైన ప్రారంభమైన బంగారం ధరలు, ఈ వారంలో ఈ మార్క్ కంటే కిందకు దిగివచ్చాయి. దేశీయ మార్కెట్లోను పసిడి ధరలు వారంలో స్వల్పంగా తగ్గాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో గతవారం పసిడి ధరల్లో పెద్దగా మార్పులేదు. శుక్రవారం 10 గ్రాముల డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.400కు పైగా పెరిగి రూ.50,700 వద్ద ముగిసింది. అంతకు రెండు రోజుల ముందు రూ.500 వరకు తగ్గింది. ఆ తర్వాత అదే స్థాయిలో పెరిగింది.

ఆల్ టైమ్ గరిష్టంతో రూ.5500 తక్కువ
ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ శుక్రవారం రూ.444 (0.88 శాతం) ఎగిసి రూ.50.808 వద్ద ముగిసింది. వెండి డిసెంబర్ ఫ్యూచర్స్ చివరి సెషన్‌లో రూ.748 (1.24 శాతం) పెరిగి రూ.60,920 వద్ద, సిల్వర్ మార్చి ఫ్యూచర్స్ రూ.721 (1.17 శాతం) పెరిగి రూ.62,455 వద్ద ముగిసింది. బంగారం ధర ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో ఇప్పటికీ రూ.5,500 తక్కువగా ఉంది. వెండి కిలో రూ.19వేల వరకు తక్కువ ఉంది.

22 క్యారెట్ల పసిడి
హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో పసిడి ధరలు నేడు రూ.300 వరకు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.52 వేల దిగువకు వచ్చింది. 22 క్యారెట్ల పసిడి రూ.47,600 పలికింది. ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రూ.52,670, 22 క్యారెట్ల బంగారం రూ.49,200గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో డౌన్
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి గతవారం 1905 డాలర్లకు పైగా ప్రారంభమైంది. ఇప్పుడు 1880 డాలర్ల దిగువకు వచ్చింది. 25 డాలర్లకు పైగా క్షీణించింది. చివరి సెషన్‌లో 0.57 శాతం పెరిగి 1878.70 డాలర్లు పలికింది. ఏడాదిలో 22 శాతం మేర పెరిగింది.
వెండి ధర వారం ప్రారంభంలో 24 డాలర్లకు పైగా ఉండగా, ఇప్పుడు కిందకు దిగి వచ్చింది. సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో 1.50 శాతం పెరిగి 23.710 డాలర్లు పలికింది.

బంగారం ధరలు భారీగా ఎందుకు తగ్గాయి
గతవారం సిక్స్ బాస్కెట్ కరెన్సీలో డాలర్ వ్యాల్యూ బలపడింది. దీంతో పసిడిపై ఒత్తిడి తగ్గింది. కరోనా భయాలు, లాక్ డౌన్ ఆందోళనలు, ఈక్విటీలు పడిపోతే పసిడి ధరలకు బలం రావాలి. కానీ ప్రస్తుతం ఇన్వెస్టర్లు డైలమాలో ఉన్నారు. ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఆగస్ట్ మొదటి వారం వరకు అంతర్జాతీయ మార్కెట్లో 2,075 డాలర్లు, దేశీయ మార్కెట్లో 56,200గా ఉంది. ఇప్పుడు 200 డాలర్లు, రూ.6,000 వరకు క్షీణించింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications