పెరిగిన బంగారం ధరలు: ఆ మార్క్‌కు పడిపోతే మరింత తగ్గవచ్చు!
బంగారం ధరలు శుక్రవారం(జూలై 31) పెరిగాయి. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.83 శాతం పెరిగి రూ.53,216కు పెరిగింది. కిలో వెండి ధర 1.4 శాతం లేదా రూ.865 పెరిగి రూ.63,535 పలికింది. బంగారం ధరలు ఎంసీఎక్స్‌లో ఈ వారం రికార్డ్ గరిష్టానికి చేరుకున్నాయి. గత సెషన్‌లో వెండి ధరలు 4 శాతం లేదా రూ.2,762 పెరిగింది. పసిడి, వెండి ధరలు గత వారం పది రోజుల్లోనే వరుసగా రూ.5,500కు పైగా, రూ.12వేల వరకు పెరిగింది.

4 ఏళ్లలో ఓ నెలలో అతిపెద్ద పెరుగుదల
మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(ఎంసీఎక్స్)లో ప్రారంభంలో లాభాల్లో ఉన్న బంగారం ధరలు, ఆ తర్వాత స్వల్పంగా తగ్గుముఖంపట్టి రూ.52,975 పలికింది. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ బలపడటం వంటి కారణాలతో ఆ తర్వాత బంగారం బలహీనపడిందని చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్ 1,958.99 డాలర్లు పలికింది. ఓ సమయంలో 1971 డాలర్లు పలికింది. దాదాపు 20 డాలర్లు పెరిగింది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.5 శాతం పెరిగి 1,953గా ఉంది. ఈ నెలలో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు 10 శాతం పెరిగాయి. గత నాలుగేళ్లలో ఓ నెలలో అతిపెద్ద పెరుగుదల ఇది. ఇతర అతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే వెండి 0.7 శాతం తగ్గి ఔన్స్ 23.39, ప్లాటినమ్ 0.2 శాతం తగ్గి 901.27 డాలర్లకు తగ్గింది.

రూ.52,800 స్థాయిని కోల్పోతే..
ఎంసీఎక్స్‌లో పసిడి ధర కీలకమైన మద్దతుస్థాయి రూ.52,800 నిలబెట్టుకోగలిగిందని, ఇదే స్థాయి పైన కొనసాగితే బంగారం ధర తిరిగి రూ.53,500 స్థాయిని అందుకుంటుందని, ఈ రోజు రూ.52,800స్థాయిని కోల్పోతే బంగారం ధరల్లో బలహీనతను చూడవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..
హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర నేడు రూ.300 వరకు పెరిగింది. 54 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.55,600 పలికింది. ఇది ఆల్ టైమ్ గరిష్టం. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.51,030 పలికింది. ఢిల్లీలోను అంతేస్థాయిలో పెరిగి 24 క్యారెట్ల బంగారం రూ.53,000 చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం రూ.51,800 పలికింది.


Click it and Unblock the Notifications