బంగారం ధరలు సోమవారం (జనవరి 4) భారీగా పెరిగాయి. దాదాపు రెండు వారాల పాటు రూ.50,000కు కాస్త అటుఇటుగా స్థిరంగా ఉన్న గోల్డ్ ఫ్యూచర్ ధర నేడు అమాంతం ఎగిసింది. క్రితం వారం వరకు రూ.50,000 ఉన్న పసిడి ఇప్పుడు రూ.51,000 దిశగా సాగుతోంది. బంగారంతో పాటు వెండి ధర కూడా పెరిగింది. కొత్త ఏడాదిలో పసిడి ధరలు కాస్త పెరుగుదల నమోదు చేయవచ్చునని, ఏడాది చివరికి పసిడి రూ.65,000కు, వెండి రూ.90,000 సమీపానికి చేరుకుంటుందనే బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

పసిడి ఈ వారం ఎలా ఉండవచ్చు
గోల్డ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ ఈ వారం రూ.50,407 కంటే ఎక్కువ ట్రేడ్ అయితే సానుకూల ధోరణి కొనసాగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. 50,050 దిగువకు వస్తే దిద్దుబాటుకు గురవుతుందని అంటున్నారు. రూ.51,889 నిరోధకస్థాయి, రూ.49,100కు దిగువన మద్దత ధర. ఎంసీఎక్స్ బుల్ డెక్స్ జనవరి కాంట్రాక్ట్ ఈ వారం రూ.15,564 కంటే దిగువకు రాకుంటే రూ.15,832, రూ.15,975 వరకు రాణించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

స్వల్పంగా పెరిగిన బంగారం
నేడు ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.545.00 (1.08%) పెరిగి రూ.50789.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,300.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.50,892.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,300.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో రూ.5400 వరకు తక్కువగా ఉంది.
ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.521.00 (1.04%)పెరిగి రూ.50,817.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,550.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.50,865.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,550.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి అతి స్వల్పంగా
కిలో సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి 1,447.00 (2.12%) పెరిగి రూ.69570.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,499.00 వద్ద ప్రారంభమై, రూ.70,259.00 వద్ద గరిష్టాన్ని, రూ.68,499.00 వద్ద కనిష్టాన్ని తాకింది. బంగారం ధర ప్రారంభంలోనే రూ.70,000 దాటింది.
మే సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం స్వల్పంగా క్షీణించింది. రూ.1,409.00 (2.04%) క్షీణించి రూ.70477.00 వద్ద ట్రేడ్ అయింది.
రూ.70,667.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.70,667.00 వద్ద గరిష్టాన్ని, రూ.70,667.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో 1900 క్రాస్
కొత్త ఏడాది 2021లో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్స్ 1900 డాలర్లు క్రాస్ చేసింది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 30.65 (+1.62%) డాలర్లు పెరిగి 1,925.75 డాలర్లు పలికింది. నేటి సెషన్లో 1,908.25 - 1,929.05 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 21.47% శాతం పెరిగింది.
సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. ఔన్స్ ధర 0.771 (+2.92%) డాలర్లు పెరిగి 27.183 డాలర్ల వద్ద ముగిసింది. నేటి సెషన్లో 26.802 - 27.330 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 48.5 శాతం పెరిగింది.
More From GoodReturns

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం, వెండి ధరలపై సస్పెన్స్.. ఆర్బీఐ నిర్ణయంతో రేట్లు తగ్గుతాయా..పెరుగుతాయా..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 7, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Today Gold Silver Rate Live: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు



Click it and Unblock the Notifications