గత నాలుగు రోజుల్లో బంగారం ధరలు మూడు రోజులు క్షీణించాయి. నేడు (మే 21, శుక్రవారం) వెండి ధరలు కూడా తగ్గాయి. పసిడి ధరలు పది గ్రాములు రూ.48,500 దిగువకు వచ్చాయి. వెండి రూ.72,000 దిగువకు వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి, వెండి ధరలు స్వల్పంగా క్షీణించాయి. 1900 డాలర్ల దిశగా కనిపించిన పసిడి ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టింది. గత ఏడాది ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే పసిడి రూ.7800 తక్కువగా ఉంది.

ఫ్యూచర్‌లో తగ్గిన ధర
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి మధ్యాహ్నం సెషన్లో రూ.138.00 (-0.28%) తగ్గి రూ.48406.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,336.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,471.00 గరిష్టాన్ని, రూ.48,336.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.180.00 (0.37%) తగ్గి రూ.48880.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,850.00 వద్ద ప్రారంభమై, రూ.48,945.00 గరిష్టాన్ని, రూ.48,850.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి రూ.500 డౌన్
వెండి ధరలు కూడా తగ్గాయి. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ నేడు మధ్యాహ్నం సెషన్లో రూ.503.00 (-0.70%) తగ్గి రూ.71801.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.71,750.00 వద్ద ప్రారంభమై, రూ.71,897.00 గరిష్టాన్ని, రూ.71,663.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.443.00 (-0.60%) తగ్గి రూ.72921.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.72,773.00 ప్రారంభమైన ధర, రూ.72,996.00 వద్ద గరిష్టాన్ని, రూ.72,773.00 కనిష్టాన్ని తాకింది.

గోల్డ్ ఫ్యూచర్స్....
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 1900 డాలర్ల దిశగా పసిడి ఇప్పుడు 1875 డాలర్ల స్థాయికి వచ్చింది. గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 5.10 (-0.27%) డాలర్లు తగ్గి 1,876.80 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,870.55 - 1,878.85 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ తగ్గింది. 0.177 (-0.63%) డాలర్లు తగ్గి 27.890 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 27.680 - 27.918 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

Gold: ఐసీఐసీఐ బ్యాంక్లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!



Click it and Unblock the Notifications