For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెరుగుతున్న బంగారం, వెండి ధరలు.. రెండోరోజు: మద్దతు ధర ఎక్కడంటే

|

ముంబై: బంగారం ఒత్తిడికి గురవుతోంది. ఇటీవలి వరకు తగ్గిన పసిడి ధరలు నిన్న పెరిగాయి. ఈరోజు కూడా ప్రారంభ సెషన్‌లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో ఉదయం అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.1 శాతం లాభపడి రూ50,190 పలికింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.5 శాతం ఎగిసి కిలో రూ.60,730 పలికింది. అంతకుముందు సెషన్‌లో పసిడి బంగారం ధరలు 1 శాతం (రూ.500కు పైగా) పెరిగాయి. వెండి 2.3 శాతం (రూ.1,360) పెరిగింది. ఇప్పటికీ ఆగస్ట్ 7న ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే రూ.6,000 తక్కువ ఉంది. కిలో వెండి రూ.18,000 వరకు తక్కువగా ఉంది.

టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సహా ఐటీ కంపెనీలపై యాక్సెంచర్ ఎఫెక్ట్! ఎందుకంటే?టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సహా ఐటీ కంపెనీలపై యాక్సెంచర్ ఎఫెక్ట్! ఎందుకంటే?

బంగారం, వెండి మద్దతు ధర..

బంగారం, వెండి మద్దతు ధర..

ఎంసీఎక్స్‌లో పసిడి ధరలు రూ.50,100 వద్ద నిలబెట్టుకోవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. రూ.50,330 నుండి రూ.50,500 మధ్య స్థాయిని చూడవచ్చునని, కీలక మద్దతు రూ.49,800 వద్ద ఉండవచ్చునని చెబుతున్నారు. ఎంసీఎక్స్‌లో వెండి ధర రూ.60,220 వద్ద నిలబెట్టుకోవచ్చని, కిలో రూ.60,800 నుండి రూ.61,500 స్థాయికి చేరుకోవచ్చునని, కీలక మద్దతు రూ.59,200గా ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. బంగారం ధరలు అస్థిరంగా కదిలే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో..

అంతర్జాతీయ మార్కెట్లో..

డాలర్ మారకం ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఔన్స్ బంగారం ధర 0.15 శాతం పెరిగి 1,883.69 డాలర్లకు పెరిగింది. అంతకుముందు సెషన్‌లో 1.1 శాతం ఎగిసింది. సిక్స్ బాస్కెట్ కరెన్సీలో డాలర్ వ్యాల్యూ స్వల్పంగా తగ్గింది. డాలర్ ఇండెక్స్ 0.4 శాతం మేర బలహీనపడింది. అయితే డాలర్ ధర పడిపోతే సిక్స్ బాక్స్ కరెన్సీలోని ఇతర కరెన్సీల్లో బంగారం ధర తగ్గుతుంది. వెండి ఔన్స్ ధర 0.1 శాతం తగ్గి 23.68 డాలర్లు పలికింది. ప్లాటినమ్ 0.2 శాతం తగ్గి 880.56 డాలర్లుగా ఉంది. ప్రపంచ దిగ్గజ గోల్డ్ ఈటీఎఫ్ ట్రస్ట్ ఎస్పీడీఆర్ గోల్డ్ ట్రస్ట్ వద్ద బంగారం నిల్వలు 0.16 శాతం పెరిగి 1,268.89 టన్నులకు పెరిగాయి.

బంగారం ధరలు

బంగారం ధరలు

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి ధరలు రూ.52,040 పలికింది. 22 క్యారెట్ల బంగారం రూ.47,700గా ఉన్నాయి. ఢిల్లీలో పసిడి ధరలు రూ.300 వరకు తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం రూ.52,750, 22 క్యారెట్ల పసిడి రూ.48,350 పలికింది. గత ఆరు నెలలుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఆగస్ట్ 7న ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. రష్యా వ్యాక్సీన్ వచ్చాక నెల పదిహేను రోజులుగా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. అమెరికా ఆర్థిక ప్యాకేజీ ప్రచారం నేపథ్యంలో అస్థిరంగా కదులుతున్నాయి.

English summary

పెరుగుతున్న బంగారం, వెండి ధరలు.. రెండోరోజు: మద్దతు ధర ఎక్కడంటే | Gold prices today struggle, touches Rs 50,190, Silver at Rs 60,400

Gold prices struggled today in Indian markets after posting strong gains in the previous session. On MCX, October gold futures rose 0.1% to ₹50,190 per 10 gram while silver futures gained 0.5% to ₹60,730 per kg. In the previous session, gold prices had risen 1% or ₹502 after struggling for most part of the day.
Story first published: Tuesday, September 29, 2020, 11:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X