రూ.47,000 పైకి.. పెరిగిన బంగారం ధర, వెండి రూ.1300 జంప్
ముంబై: బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. నిర్మలా సీతారామన్ బడ్జెట్ అనంతరం బంగారం ధరలు దాదాపు రూ.3వేలకు పైగా తగ్గాయి. అయితే నేడు స్వల్పంగా పెరిగాయి. గత ఏడాది ఆగస్ట్ నెలలో ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200 తాకిన పసిడి, ఆ తర్వాత వ్యాక్సీన్ ప్రకటనతో తగ్గుముఖం పట్టాయి. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.9200 వరకు తక్కువగా ఉంది. నిన్న ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.1,067, వెండి ఫ్యూచర్స్ రూ.1500 వరకు తగ్గింది. మళ్లీ నేడు పెరిగింది.

47,000 తాకిన పసిడి
ఎంసీఎక్స్‌లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు (శుక్రవారం, ఫిబ్రవరి 5వ తేదీ) ఉదయం 373.00 (0.80%) పెరిగి రూ.47,088.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,850.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,250.00 వద్ద గరిష్టాన్ని, రూ.46,806.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.9200 వరకు తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.290.00(0.62 శాతం) పెరిగి రూ.47,132 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,982.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,444.00 వద్ద గరిష్టాన్ని, రూ.46,955.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి రూ.1300 జంప్
వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో 1,296.00 (1.94%) పెరిగి రూ.68114.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,210.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.68,333.00 వద్ద గరిష్టాన్ని, రూ.67,205.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా రూ.1,236.00 (1.82%) పెరిగి రూ.69,237.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,200.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.68,355.00 వద్ద గరిష్టాన్ని, రూ.68,200.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1800 డాలర్ల పైకి పసిడి
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర భారీగా తగ్గినప్పటికీ, నేడు మళ్లీ పెరిగి 1800 డాలర్ల పైకి చేరుకుంది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 16.65 (+0.93%)
డాలర్లు తగ్గి 1807.75 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,792.25 - 1,812.10 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 13.15% శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. ఔన్స్ ధర 0.554
(+2.11%) డాలర్లు తగ్గి 26.778 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.258 - 26.852 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 48.234 శాతం పెరిగింది.


Click it and Unblock the Notifications