రూ.50,000 పైనే బంగారం ధర, రికార్డ్‌తో రూ.6000 తక్కువ
ముంబై: అమెరికా ఆర్థిక ప్యాకేజీ, బ్రిటన్ కొత్త వైరస్ నేపథ్యంలో బంగారం ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అంతలోనే పెరుగుతూ, మళ్లీ తగ్గుతోంది. గోల్డ్ ఫ్యూచర్ ధరలు నిన్న (సోమవారం) తొలుత భారీగా పెరిగినప్పటికీ, చివరకు క్షీణించాయి. ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.11 క్షీణించి రూ.50062.00 వద్ద, ఏప్రిల్ ఫ్యూచర్స్ రూ.31 క్షీణించి రూ.50098.00 వద్ద ముగిసింది. మళ్లీ ఈ రోజు ప్రారంభ సెషన్లో ప్రారంభమైంది. అదే సమయంలో సిల్వర్ ఫ్యూచర్స్ పెరిగింది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1,316.00 పెరిగి రూ.68825.00 వద్ద, మే ఫ్యూచర్స్ 1,411.00 ఎగిసి రూ.69733.00 వద్ద క్లోజ్ అయింది.

బంగారం జంప్
నేడు ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.72.00 (0.14%) పెరిగి రూ.50085.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,051.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.50,108.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,027.00 వద్ద కనిష్టాన్ని తాకింది. పసిడి 50వేల దిగువన కూడా కదలాడింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో రూ.6000 తక్కువగా ఉంది.
ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.49.00 (0.10%) పెరిగి రూ.50150.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,152.00 వద్ద ప్రారంభమై, రూ.50,152.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,144.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి స్వల్ప తగ్గుదల
నిన్న రూ.13000కు పైగా పెరిగిన వెండి ధరలు, నేడు ప్రారంభ సెషన్లో తగ్గాయి. కిలో సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి 78.00 (-0.11%) ఎగిసి రూ.68739.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,555.00 వద్ద ప్రారంభమై, రూ.68,770.00 వద్ద గరిష్టాన్ని, రూ.68,511.00 వద్ద కనిష్టాన్ని తాకింది. గత వారం మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.67518.00 వద్ద క్లోజ్ అయింది. ఇప్పుడు రూ.69వేలు దాటి రూ.70వేల దిశగా కనిపించినా, ఆ తర్వాత క్షీణించింది.
మే ఫ్యూచర్స్ రూ.232.00 (-0.33%) పెరిగి రూ.69560.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,560.00 వద్ద ప్రారంభమై, రూ.69,560.00 వద్ద గరిష్టాన్ని, రూ.69,560.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో..
అంతర్జాతీయ మార్కెట్లో ఇటీవల గోల్డ్ ఫ్యూచర్స్ 1900 డాలర్ల దిశగా సాగింది. ఆ తర్వాత తగ్గుముఖం పట్టింది. నేడు స్వల్పంగా పెరిగింది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 2.90 (+0.15%) డాలర్లు పెరిగి 1,883.30 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 1,877.20 - 1,886.25 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 21.89 శాతం పెరిగింది.
సిల్వర్ ఫ్యూచర్స్ ఔన్స్ 0.051 (-0.19%) డాలర్లు తగ్గి 26.488 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.343 - 26.765 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 49.19% పెరిగింది.


Click it and Unblock the Notifications