ముంబై: బంగారం ధరలు ఒత్తిడిలో ట్రేడ్ అవుతున్నాయి. నేడు (సోమవారం, ఫిబ్రవరి 15) ధరలు స్వల్పంగా పెరిగినప్పటికీ, ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో దాదాపు రూ.8900 వరకు తక్కువగా ఉంది. యూఎస్ ట్రెజరీ యీల్డ్స్ మార్చి నుండి మొదటిసారి రిష్టాన్ని తాకాయి. ద్రవ్యోల్భణం ఆరేళ్ల గరిష్టానికి చేరుకుంది. భారీ ద్రవ్యోల్భణం బంగారం ధరలపై కొద్దిగా ఒత్తిడిని పెంచింది. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్, దేశాల మధ్య ఉద్రిక్తతలు, కరోనా వంటి తాత్కాలిక పరిస్థితులు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి.

నేడు అతి స్వల్పంగా పెరిగిన బంగారం ధర
ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో బంగారం ధర నేడు అతిస్వల్పంగా పెరిగింది. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ఉదయం సెషన్లో రూ.74.00 (0.16%) పెరిగి రూ.47,392.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,436.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,455.00 వద్ద గరిష్టాన్ని, రూ.47,326.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.8900కు పైగా తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.35.00 (0.07%) తగ్గి రూ.47,476 వద్ద ట్రేడ్ అయింది.

రూ.70,000 దిశగా వెండి
వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఎంసీఎక్స్‌లో కిలో వెండి రూ.70,000 దిశగా కనిపిస్తోంది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.658.00 (0.95%) పెరిగి రూ.69,775.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,300.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.70,067.00 వద్ద గరిష్టాన్ని, రూ.69,300.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా కిలో రూ.648.00 (0.92%) పెరిగి రూ.70,843.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.70,940.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.71,060.00 వద్ద గరిష్టాన్ని, రూ.70,843.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

గోల్డ్ ఫ్యూచర్స్ స్వల్పంగా తగ్గుదల
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఔన్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 1825 డాలర్లకు దిగువనే ఉంది. నేడు గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ -0.85
(0.05%) డాలర్లు తగ్గి 1822.35 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,820.00 - 1,827.00 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 13.44 శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ పెరిగింది. ఔన్స్ ధర +0.247
(+0.90%) డాలర్లు తగ్గి 27.575 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 27.460 - 27.738 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 54.33 శాతం పెరిగింది.
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!



Click it and Unblock the Notifications