ముంబై: బంగారం ధరలు మంగళవారం(డిసెంబర్ 22) ప్రారంభ సెషన్‌లో ఒత్తిడికి గురయ్యాయి. బ్రిటన్, అమెరికా తదితర దేశాల్లో కొత్త రకం వైరస్ కేసులు నమోదు కావడం, పలు ప్రాంతాల్లో ఆంక్షలు అమలు చేయడంతో గత కొద్ది రోజులుగా పసిడిపై ఒత్తిడి పెరిగి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. కరోనా వ్యాక్సినైజేషన్ ప్రకటన నేపథ్యంలో గత నెలలో రూ.47,500 స్థాయికి వచ్చిన పసిడి, ఇప్పటి వరకు దాదాపు రూ.3000 పెరిగింది. నేడు పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి.
బ్రిటన్‌లో కొత్త కేసుల నేపథ్యంలో నిన్న మార్కెట్లు కుప్పకూలాయి. అయితే చివరలో అతి భారీ నష్టాల నుండి కాస్త ముందుకు వచ్చాయి. అలాగే, బంగారం ధరలు కూడా ప్రారంభంలో రూ.500 వరకు పెరిగినా, చివరకు స్వల్ప పెరుగుదలతో ముగిశాయి.

నిన్న బంగారం, వెండి ముగింపు
బంగారం ధర నిన్న ఉదయం భారీగా పెరిగినప్పటికీ, ముగింపు సమయానికి స్వల్పంగా తగ్గాయి. దీంతో గోల్డ్ ఫిబ్రవరి ఫ్యూచర్స్ నిన్న రూ.85.00 (0.17%) పెరిగి రూ.50389.00 వద్ద క్లోజ్ అయింది. ఏప్రిల్ ఫ్యూచర్స్ రూ.51.00 (0.10%) క్షీణించి రూ.50400.00 వద్ద ముగిసింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.5,700 తక్కువగా ఉంది.
సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి రూ.1,040.00 (1.53%) పెరిగి రూ.68947.00 వద్ద క్లోజ్ అయింది. మే ఫ్యూచర్స్ రూ.1,329.00 (1.94%) పెరిగి రూ.69985.00 వద్ద క్లోజ్ అయింది. ఓ సమయంలో రూ.70వేలు దాటిన సిల్వర్ ఆ తర్వాత తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ గతవారం రూ.60వేలకు దిగువన ఉన్న పసిడి, ఇప్పుడు రూ.69వేలకు చేరుకుంది.

నేటి బంగారం ధరలు
బంగారం ధర ఫిబ్రవరి ఫ్యూచర్స్ ఉదయం గం.9.45 సమయానికి రూ.44.00 (0.09%) పెరిగి రూ.50460.00 వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో రూ.50,527.00 వద్ద ప్రారంభమై, రూ.50,527.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,416.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
ఏప్రిల్ ఫ్యూచర్స్ 40.00 (0.08%) పెరిగి రూ.50497.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,500.00 వద్ద ప్రారంభమై, రూ.50,507.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,465.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి రూ.588.00 (0.85%) పెరిగి రూ.69606.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,797.00 వద్ద ప్రారంభమై, రూ.69,797.00 వద్ద గరిష్టాన్ని, రూ.69,491.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మే ఫ్యూచర్స్ సిల్వర్ రూ.577.00 (0.82%) పెరిగి రూ.70551.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.70,494.00 వద్ద ప్రారంభమై, రూ.70,574.00 వద్ద గరిష్టాన్ని, రూ.70,437.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో..
అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. నిన్న 1,882.80 వద్ద క్లోజ్ అయిన గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 3.95 (+0.21%) డాలర్లు పెరిగి 1,886.75 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,880.55 - 1,889.35 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. ఏడాదిలో 26.28 శాతం పెరిగింది.
సిల్వర్ ఫ్యూచర్స్ 0.258 (+0.98%) డాలర్లు పెరిగి 26.637 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.312 - 26.812 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 54.16 శాతం పెరిగింది.
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 7, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం ధరల తగ్గుదలపై యూబీఎస్ సంచలన నివేదిక.. సామాన్యులకు పండగలాంటి వార్తే ఇది.. ఇన్వెస్టర్లకు మాత్రం..

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

Gold: బంగారంపై రుణం కావాలా? గోల్డ్ లోన్ కంటే ఇదే బెస్ట్.. తక్కువ వడ్డీకే డబ్బు!



Click it and Unblock the Notifications