3వ రోజు పెరిగిన బంగారం ధరలు, వెండి డౌన్: ఆ ధరతో రూ.7,000 తగ్గుదల
ముంబై: దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో (MCX) మూడు రోజులుగా పసిడి ధరలు క్షీణిస్తున్నాయి. నేడు (శుక్రవారం, డిసెంబర్ 11) ప్రారంభ సెషన్‌లో స్వల్పంగా పెరుగుదలను నమోదు చేశాయి. గతవారం ధరలు భారీగా పెరిగాయి. అంతకుముందు వరుసగా 3 వారాలు క్షీణించి రూ.48,000 దిగువకు వచ్చాయి. ఇప్పుడు రూ.49వేల పైకి చేరుకున్నాయి. ఇటీవల ఫైజర్ కరోనా వ్యాక్సీన్‌కు అమెరికా అనుమతుల నేపథ్యంలో పసిడి ధరలు క్షీణిస్తున్నాయి.

రూ.7,000కు పైగా డౌన్
ఎంసీఎక్స్‌లో ప్రారంభ సెషన్‌లో 10 గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్ ఫిబ్రవరి రూ.58.00 (0.12%) పెరిగి రూ.49135.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,150.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,165.00 గరిష్టాన్ని, రూ.49,103.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ 7 నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.7,000కు పైగా తక్కువ ఉంది.
ఏప్రిల్ ఫ్యూచర్స్ రూ.33.00 (0.07%) పెరిగి రూ.49186.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,253.00 వద్ద ప్రారంభమై, రూ.49,253.00 వద్ద గరిష్టాన్ని, రూ.49,120.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

సిల్వర్ ఫ్యూచర్స్ డౌన్
సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి కిలో రూ.39.00 (-0.06%) క్షీణించి రూ.63491.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.63,459.00 ప్రారంభమై, రూ.63,550.00 వద్ద గరిష్టాన్ని, రూ.63,387.00 వద్ద కనిష్టాన్ని తాకింది. మే ఫ్యూచర్స్ రూ.329.00 (-0.51%) తగ్గి రూ.64267.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.64,267.00 ప్రారంభమై, రూ.64,267.00 గరిష్టాన్ని, రూ.64,267.00 కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో పైపైకి..
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 3.40 (+0.19%) డాలర్లు పెరిగి 1,840.80 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,839.05 - 1,844.40 డాలర్ల వద్ద కదలాడింది. పసిడి ఏడాదిలో 22.81% పెరిగింది. ఇక సిల్వర్ ఫ్యూచర్స్ 0.004 (+0.02%) పెరిగి 24.098 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 24.017 - 24.198 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. ఏడాదిలో వెండి 41.92 శాతం పెరిగింది.


Click it and Unblock the Notifications