Gold prices today: బంగారం మద్దతు ధర, నిరోధకస్థాయి
బంగారం ధరలు నేడు(సోమవారం, ఆగస్ట్ 16) దాదాపు స్థిరంగా ఉన్నాయి. క్రితం సెషన్‌లో పసిడి ధరలు లాభపడ్డాయి. నేటి సెషన్‌లో స్వల్పంగా నష్టపోయాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో గోల్డ్ ఫ్యూచర్స్ ఫ్లాట్‌గా ప్రారంభమైంది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి ప్రారంభ సెషన్‌లో రూ.45.00 (-0.10%) క్షీణించి రూ.46895.00 వద్ద ట్రేడ్ అయింది.
డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.47,095 వద్ద ఉంది. సిల్వర్ ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ ధర రూ.354.00 (-0.56%) క్షీణించి రూ.62884.00 వద్ద, డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.335.00 (-0.52%) తగ్గి రూ.63630.00 వద్ద ట్రేడ్ అయింది.

గోల్డ్ ఫ్యూచర్స్ 3.55 (0.20%) డాలర్లు క్షీణించి 1,774.55 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.249 (1.05%) డాలర్లు క్షీణించి 23.530 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.రూ.9300 తక్కువగా ఉంది. గోల్డ్ ఫ్యూచర్స్ గతవారం రూ.46,200 స్థాయికి వచ్చినప్పటికీ, ఆ తర్వాత మళ్లీ పెరిగింది. గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ఓ సమయంలో రూ.47,000 క్రాస్ చేసింది. మొత్తానికి గోల్డ్ రూ.47,000 స్థాయిలోనే ఉంది.
డాలర్ ఇండెక్స్ నేడు ఒక వారం కనిష్టానికి పడిపోయింది. అలాగే బెంచ్ మార్క్ టెన్ ఇయర్ బాండ్ యీల్డ్స్ ఆగస్ట్ 13వ తేదీ నాటికి 1.30 శాతం క్షీణించాయి. ఈ అంశాలు బంగారం వృద్ధికి కారణమయ్యాయి. ఎంసీఎక్స్‌లో బంగారం మద్దతు ధర రూ.46,700-46,550, నిరోధకస్థాయి రూ.47,180-47,400, వెండి మద్దతు ధర రూ.62,600-62,100, నిరోధకస్థాయి రూ.63,800-64,400గా ఉంది.


Click it and Unblock the Notifications