గతవారం రూ.1200 మేర తగ్గిన పసిడి ధరలు మంగళవారం దాదాపు స్థిరంగా ఉన్నాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో 10 గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్ ప్రారంభంలో 0.5 శాతం ఎగిసింది. ఆ తర్వాత క్షీణించింది. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.24.00 (-0.05%) క్షీణించి రూ.50,806.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,800.00 ప్రారంభమై, రూ.50,888.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.50,738.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.5,400 తక్కువగా ఉంది.

స్వల్పంగా తగ్గుదల
డిసెంబర్ ఫ్యూచర్స్ రూ.24 క్షీణించగా, ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.36.00 (-0.07%) క్షీణించి పది గ్రాముల పసిడి రూ.50870.00 పలికింది. రూ.50,906.00 వద్ద ప్రారంభమై, రూ.50,947.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,817.00 వద్ద కనిష్టాన్ని తాకింది. కరోనా నేపథ్యంలో మార్చి నుండి పసిడి ధరలు రూ.10వేలకు పైగా పెరిగాయి. అయితే ఆల్ టైమ్ గరిష్టం నుండి రూ.5వేలకు పైగా తక్కువ పలుకుతోంది.

వెండిది అదే దారి
సిల్వర్ ఫ్యూచర్స్ కూడా అతి స్వల్పంగా తగ్గింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.98.00 (-0.15%) క్షీణించి కిలో రూ.63,593.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.63,690.00 వద్ద ప్రారంభమై, రూ.63,715.00 వద్ద గరిష్టాన్ని, రూ.63,483.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మార్చి ఫ్యూచర్స్ రూ.109.00 (-0.17%) క్షీణించి రూ.65,380.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.65,496.00 ప్రారంభమైన ధర, రూ.65,496.00 వద్ద గరిష్టాన్ని, రూ.65,308.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో..
గోల్డ్ ఫ్యూచర్స్ డిసెంబర్ ఔన్స్ ధర 3.55 (-0.19%) డాలర్లు క్షీణించి 1,884.25 వద్ద ట్రేడ్ అయింది. పసిడి ధర ఆగస్ట్‌లో 2072 డాలర్ల గరిష్టాన్ని తాకింది. ఇప్పుడు దాదాపు 200 డాలర్ల తక్కువతో 1900 డాలర్ల దిగువన ట్రేడ్ అవుతోంది. 1,885.15 - 1,890.85 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 1,887.80 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఏడాదిలో గోల్డ్ ఫ్యూచర్స్ 26.03% పెరిగింది.
వెండి -0.084 (-0.30%) డాలర్లు క్షీణించి 24.718 డాలర్లు పలికింది. 24.738 - 24.898 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 24.802 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో 46.52% పెరిగింది.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!



Click it and Unblock the Notifications