గతవారం భారీగా తగ్గి 46,000 స్థాయికి వచ్చిన గోల్డ్ ఫ్యూచర్స్ మళ్లీ పెరుగుతోంది. వరుసగా మూడు సెషన్లుగా పసిడి పైపైకి చేరుకుంటోంది. ఓ సమయంలో రూ.46వేల దిగువకు చేరుకున్నప్పటికీ ఇప్పుడు మళ్లీ రూ.47వేల దిశగా కనిపిస్తోంది. మంగళవారం ఉదయం పసిడి స్వల్పంగా పెరిగింది. నిన్న (సోమవారం) భారీగా పసిడి, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.703.00 (1.52 శాతం) పెరిగి రూ.46,900 వద్ద, జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.699.00 (1.51 శాతం) లాభపడి రూ.47,039 వద్ద ముగిసింది. సిల్వర్ ధరలు కూడా భారీగానే పెరిగాయి. నిన్న మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1,453.00 (2.11%) పెరిగి రూ.70,465.00 వద్ద, మే ఫ్యూచర్స్ రూ.1,466.00 (2.09%) పెరిగి రూ.71,625.00 వద్ద ముగిసింది.

రూ.47,000 దిశగా బంగారం
ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో బంగారం ధర నేడు ప్రారంభ సెషన్లో స్వల్పంగా పెరిగింది. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.71.00 (0.15%) పెరిగి రూ.46,972.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,973.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.46,973.00 వద్ద గరిష్టాన్ని, రూ.46,909.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.9,400 తక్కువ ఉంది. రెండు రోజుల్లో రూ.800కు పైగా పెరిగింది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.78.00 (0.17%)పెరిగి రూ.47,100 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,077.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,100.00 వద్ద గరిష్టాన్ని, రూ.47,077.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.70వేలు దాటిన వెండి
వెండి ధరలు కూడా వరుసగా పెరిగి రూ.70,500ను క్రాస్ చేశాయి. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.130.00 (0.18%) పెరిగి రూ.70,562.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.70,675.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.70,675.00 వద్ద గరిష్టాన్ని, రూ.70,513.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మే సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.132.00 (0.18%) పెరిగి రూ.71710.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.71,660.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.71,778.00 వద్ద గరిష్టాన్ని, రూ.71,694.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1800 డాలర్లు దాటిన పసిడి
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు మళ్లీ 1800 డాలర్లు దాటింది. ఉదయం సెషన్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 2.75 (+0.15%) డాలర్లు పెరిగి 1811.15 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,805.85 - 1,815.05 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 8.32 శాతం తగ్గింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. ఔన్స్ ధర 0.122 (+0.43%) డాలర్లు పెరిగి 28.207 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 28.050 - 28.422 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!

Gold silver: బంగారం, వెండి కొనేవారికి అలర్ట్.. ఈ వారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే!

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు



Click it and Unblock the Notifications