ముంబై: బంగారం ధరలు నేడు భారీగా తగ్గాయి. నిన్న రూ.50వేలకు పైగా ఎగిసిన పసిడి ధరలు నేడు ఈ రోజు రూ.49,600 దిగువకు వచ్చాయి. ఆల్ టైం గరిష్టం రూ.56,200తో రూ.6,700 వరకు తక్కువగా ఉంది. అంతకుముందు వరుసగా మూడు వారాలు పసిడి ధరలు తగ్గి, రూ.48,000 దిగువకు వచ్చాయి. ఇప్పుడు గత వారం రోజులుగా పెరుగుతున్నాయి. అయితే నేడు మళ్లీ పతనమయ్యాయి. వెండి ధరలు కూడా రూ.1100కు పైగా క్షీణించాయి. అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి, సిల్వర్ ధరలు తగ్గాయి.

బంగారం రూ.580 వరకు డౌన్
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో 10 గ్రాములు పసిడి ధర (ఫిబ్రవరి ఫ్యూచర్స్) నేడు రూ.579.00 (-1.16%) క్షీణించి రూ.49530.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,850.00 వద్ద ప్రారంభమై, రూ.49,886.00 వద్ద గరిష్టాన్ని, రూ.49,160.00 వద్ద కనిష్టాన్ని తాకాయి.
ఏప్రిల్ ఫ్యూచర్స్ రూ.443.00 (-0.88%) క్షీణించి రూ.49686.00 వద్ద ట్రేడ్ అయ్యాయి. రూ.49,908.00 ప్రారంభమై, రూ.49,970.00 వద్ద గరిష్టాన్ని, రూ.49,360.00 వద్ద కనిష్టాన్ని తాకాయి.

వెండి వెయ్యికి పైగా తగ్గుదల
ఇక వెండి ధరలు మార్చి ఫ్యూచర్స్ కిలో రూ.1,103.00 (-1.69%) తగ్గి రూ.64089.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.64,521.00 వద్ద ప్రారంభమై, రూ.64,804.00 వద్ద గరిష్టాన్ని, రూ.63,483.00 కనిష్టాన్ని తాకింది.
మే ఫ్యూచర్స్ రూ.1,094.00 (-1.66%) తగ్గి రూ.64816.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.65,209.00 వద్ద ప్రారంభమై, రూ.65,614.00 వద్ద గరిష్టాన్ని, రూ.64,350.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

ధరలు తగ్గడానికి కారణాలివే..
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ -30.35 (-1.62%)డాలర్లు తగ్గి 1,844.65 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,841.15 - 1,875.40 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి 25.56% పెరిగింది.
వెండి ఫ్యూచర్స్ ఔన్స్ 0.594 (-2.40%) క్షీణించి 24.142 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 24.058 - 24.740 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో ధర 46.52% పెరిగింది.
కరోనా కేసులు తగ్గడం, ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతుండటానికి తోడు ప్రధానంగా వ్యాక్సీన్ సానుకూల ప్రకటనలు బంగారంపై ఒత్తిడిని తగ్గించాయి. ఫైజర్ కరోనా వ్యాక్సీన్‌కు అమెరికా అనుమతివ్వడంతో ఈక్విటీ మార్కెట్లు పుంజుకొని, పసిడి మార్కెట్ క్షీణించింది. ఈ ప్రకటన నేపథ్యంలో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుక్ చేస్తున్నారు. దీంతో ఒత్తిడి పెరిగింది. అలాగే ఆర్థిక ప్యాకేజీపై కదలిక కూడా పసిడిపై ప్రభావం చూపింది.
More From GoodReturns

భగ్గుమన్న బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంత వరకు వెళ్లిందంటే.. ఏప్రిల్ 8, బుధవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై కీలక అప్డేట్.. కొత్త లక్ష్యాలను విడుదల చేసిన ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

Today Gold Silver Rate Live: ఇరాన్ ఉద్రిక్తతలతో మారుతున్న బంగారం ధరలు

బంగారం ధరల తగ్గుదలపై యూబీఎస్ సంచలన నివేదిక.. సామాన్యులకు పండగలాంటి వార్తే ఇది.. ఇన్వెస్టర్లకు మాత్రం..

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!



Click it and Unblock the Notifications