Gold Prices Today: రూ.51,500కు సమీపంలో బంగారం ధరలు
రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో పసిడి ధరలు నేడు (మార్చి 3, గురువారం) దాదాపు స్థిరంగా ఉన్నాయి. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం, దీంతో ఆయిల్ ధరలు భారీగా పెరిగిన కారణంగా పసిడిపై ప్రభావం పడింది. దీంతో పసుపు లోహం నిన్న కాస్త శాంతించినప్పటికీ నేడు మళ్లీ కాస్త పుంజుకుంది. సురక్షిత పెట్టుబడిగా భావిస్తుండటంతో కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ఇది పసిడికి సపోర్ట్ ఇస్తోందని కొటక్ సెక్యూరిటీస్ రవీంద్ర రావు తెలిపారు.

బంగారం, వెండి ధరలు
బంగారం ధరలు నేటి సెషన్‌లో స్వల్పంగా పెరిగాయి. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.166 లేదా 0.32 శాతం పెరిగి రూ.51,460 వద్ద, జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.158 లేదా 0.31 శాతం పెరిగి రూ.51,672 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి రూ.266 పెరిగి రూ.67,229 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.288 పెరిగి రూ.67,955 వద్ద ట్రేడ్ అయింది. పసిడి రూ.51,500కు దిగువన ఉండగా, వెండి రూ.67,300ను సమీపించింది.

నిన్న బంగారం రూ.52,000 క్రాస్
క్రితం సెషన్‌లో ఓ సమయంలో రూ.52,000 క్రాస్ చేసిన పసిడి ఏప్రిల్ ఫ్యూచర్ ధరలు ఆ తర్వాత రూ.536 క్షీణించి రూ.51,280 వద్ద ముగిసింది. జూన్ గోల్డ్ ఫ్యూచర్ కూడా రూ.433 తగ్గి రూ.51,522 వద్ద ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్ కూడా క్రితం సెషన్‌లో రూ.374 తగ్గి రూ.66,625 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.524 తగ్గి రూ.67,655 వద్ద ముగిసింది. క్రితం సెషన్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ ఓ సమయంలో రూ.68,000 దాటాయి.

అంతర్జాతీయ మార్కెట్లో..
అంతర్జాతీయ మార్కెట్లోను ధరలు పెరిగాయి. క్రితం సెషన్‌లో తగ్గినప్పటికీ నేడు 2.5 డాలర్లు పెరిగిన గోల్డ్ ఫ్యూచర్స్ 1924.85 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.100 డాలర్లు పెరిగి 25.290 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ 25.190 డాలర్ల వద్ద, గోల్డ్ ఫ్యూచర్స్ 1922 డాలర్ల వద్ద ముగిసింది.


Click it and Unblock the Notifications