బంగారం, వెండి ధరలు బుధవారం (జూన్ 10) పెరిగాయి. ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఆగస్ట్ ఫ్యూచర్స్ సానుకూల ధోరణి ప్రదర్శించింది. ఉదయం గం.9.30 సమయానికి జూన్ గోల్డ్ కాంట్రాక్ట్స్ 10 గ్రాములకు 0.12 శాతం లేదా రూ.56 పెరిగి రూ.46,650 పలికింది. సిల్వర్ జూలై ఫ్యూచర్స్ 0.13 శాతం లేదా రూ.61 పెరిగి కిలో రూ.48,160 పలికింది.

ఇన్వెస్టర్లు ఆచితూచి
బంగారం ధరలు రూ.46,100 నుండి రూ.46,850 స్థాయిలో ఉండవచ్చునని, రూ.46,500కు పైకి చేరుకుంటే తిరిగి రూ.47,000 మార్క్‌కు చేరుకోవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆసియా మార్కెట్లు క్రమంగా పుంజుకుంటున్నాయి. అమెరికా డాలర్ బలహీనంగా ఉంది. ఈ ప్రభావం బంగారంపై ఉంటుంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ మీటింగ్ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు,.

అంతర్జాతీయ మార్కెట్లో..
అంతర్జాతీయ మార్కెట్లోను బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. స్పాట్ గోల్డ్ 0.1 శాతం పెరిగి ఔన్స్ 1,715.94 డాలర్లు పలికింది. వెండి ధర ఔన్స్ 17.60 డాలర్ల వద్ద ఫ్లాట్‌గా ఉంది. ప్లాటినం ధర 0.3 శాతం తగ్గి 834.46 డాలర్లు పలికింది.

హైదరాబాద్, ఢిల్లీలలో..
బహిరంగ మార్కెట్ విషయానికి వస్తే దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ.46,400 కాగా, ఈ రోజు స్వల్పంగా తగ్గి రూ.46,300 పలికింది. హైదరాబాద్‌లో నిన్న 24 క్యారెట్ల బంగారం రూ.48,510 కాగా, ఈ రోజు స్వల్పంగా తగ్గి రూ.48,420 పలికింది. 22 క్యారెట్ల బంగారం రూ.44,470 పలకగా, ఈ రోజు రూ.44,350 పలికింది. అంటే బంగారం ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి.
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications