నిన్న భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు ఈ రోజు మళ్లీ పెరిగాయి. నిన్న పసిడి (డిసెంబర్ ఫ్యూచర్) ధర ఏకంగా రూ.2,502.00 (4.80%) తగ్గి రూ.49665.00 వద్ద, ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.2,487.00 (4.75%) రూ.49850.00 వద్ద ముగిసింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200 నుండి పసిడి ధరలు ఇప్పటికీ రూ.5700 తక్కువగా ఉంది. వెండి ఆల్ టైమ్ గరిష్టం రూ.79వేలతో రూ.17వేల వరకు తక్కువగా ఉంది. దేశీయ, అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో పసిడి1.5 శాతం, వెండి ఫ్యూచర్ 2.90 శాతం పెరిగింది.

రూ.770 పెరిగిన బంగారం
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో నేడు (నవంబర్ 10వ తేదీ) సాయంత్రం గం.9 సమయానికి 10 గ్రాముల డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.770.00 (1.55%) పెరిగి రూ.50,518.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,931.00 వద్ద ప్రారంభమై, రూ.50,664.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.49,931.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.758.00 (1.52%) పెరిగి రూ.50,651.00 వద్ద ట్రేడ్ అయింది. 10 గ్రాముల ధర రూ.50,383.00 వద్ద ప్రారంభమై, రూ.50,721.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.50,216.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.1700కు పైగా పెరిగిన వెండి
వెండి ధర కూడా భారీగానే పెరిగింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ ఒక కిలో రూ.1,760.00 (2.89%) పెరిగి రూ.62,614.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.61,900.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.62,874.00 వద్ద గరిష్టాన్ని, రూ.61,443.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.1,797.00 (2.87%) పెరిగి రూ.64,400.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.63,900.00 ప్రారంభమైన ధర, రూ.64,547.00 గరిష్టాన్ని తాకి, రూ.63,247.00 కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లోను జంప్
అంతర్జాతీయ మార్కెట్లోను ధరలు పెరిగాయి. కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1.25 శాతం పెరిగి ఔన్స్ ధర 1,877 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 1,859.60 - 1,888.40 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 1,854.40 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో గోల్డ్ ఫ్యూచర్స్ 25 శాతం పెరిగింది.
సిల్వర్ ఫ్యూచర్స్ ఔన్స్ ధర 2.79 శాతం పెరిగి 24.363 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 23.955 - 24.508 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 23.701 డాలర్ల వద్ద ముగిసింది. ఈ ఏడాది 43.64 శాతం మేర పెరిగింది.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు ర్యాలీ చేసిందంటే.. ఏప్రిల్ 11, శనివారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు తగ్గాయి. తాజా రేట్లు ఇక్కడ చూడండి

Today Gold Silver Rate Live: ఇరాన్ ఉద్రిక్తతలతో మారుతున్న బంగారం ధరలు

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

భగ్గుమన్న బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంత వరకు వెళ్లిందంటే.. ఏప్రిల్ 8, బుధవారం ధరలు ఇవే..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై కీలక అప్డేట్.. కొత్త లక్ష్యాలను విడుదల చేసిన ఆర్థిక నిపుణులు..

బంగారం, వెండి ధరలపై సస్పెన్స్.. ఆర్బీఐ నిర్ణయంతో రేట్లు తగ్గుతాయా..పెరుగుతాయా..

Today Gold Silver Rate Live: ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటన దెబ్బకు భారీగా పెరిగిన బంగారం ధరలు

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!

Today Gold Silver Rate Live: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications