బంగారం ధరలు అస్థిరంగా కొనసాగుతున్నాయి. గతవారం భారీగా తగ్గిన, ధరలు అంతకుముందు అంతేస్థాయిలో పెరిగాయి. ఈ వారం స్వల్ప తగ్గుదలను, పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. నిన్న తగ్గిన ధరలు, ఈ రోజు మరోసారి పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.4 శాతం ఎగిసి 10 గ్రాములు రూ.52,345 పలికింది. వెండి కిలో ధర రూ.1,000 పెరిగి రూ.68,560 పలికింది. ఇంతకుముందు రెండు సెషన్లలో పసిడి రూ.1500 వరకు తగ్గగా, వండి కిలో రూ.1650కి పైగా క్షీణించింది. రెండు వారాల క్రితం పసిడి రూ.57,000 రికార్డ్‌తో ధర వేలల్లో తక్కువగా ఉంది.

వివిధ నగరాల్లో ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,850 నుండి రూ.51,200కు పడిపోయింది. 24 క్యారెట్ల పసిడి రూ.700 తగ్గి రూ.55,850 పలికింది. చెన్నైలో 22 క్యారెట్లు రూ.50,840, 24 క్యారెట్లు రూ.55,460, ముంబైలో 22 క్యారెట్లు రూ.50,990 పలికింది. హైదరాబాద్, విజయవాడల్లో 24 క్యారెట్ల బంగారం ధరలు రూ.800 వరకు తగ్గి రూ.55,500కు పైగా పలికింది. 22 క్యారెట్ల పసిడి రూ.51వేల వరకు చేరుకుంది.

క్షీణించిన డాలర్..
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. స్పాట్ గోల్డ్ 0.4 శాతం పెరిగి ఔన్స్ ధర 1,949.83 డాలర్లకు చేరుకుంది. అమెరికా డాలర్ వ్యాల్యూ ఇతర కరెన్సీలతో పడిపోయింది. ఈ ప్రభావం పసిడిపై పడింది. ఇతర అతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే వెండి ఔన్స్ 27.38 డాలర్లు, ప్లాటినమ్ 0.5 శాతం ఎగిసి 922.24 డాలర్లకు చేరుకుంది.

1949 నుండి 1932 డాలర్ల మధ్య
పసిడి ధరలు ఔన్స్ ధర 1949 నుండి 1932 డాలర్ల మధ్య ట్రేడ్ కావొచ్చునని అంతర్జాతీయ బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అమెరికా స్టాక్ మార్కెట్ ఆల్‌టైమ్ హైకి చేరడం, సెప్టెంబర్ భేటీలో యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల మరింత తగ్గించే అవకాశముందన్న అంచనాలు గురువారం దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలను దెబ్బతీశాయని చెబుతున్నారు. అయితే ఈ రోజు స్వల్పంగా పుంజుకున్నాయి.


Click it and Unblock the Notifications