Gold prices today: భారీగా తగ్గి, ఇప్పుడు స్వల్పంగా పెరిగిన ధరలు
క్రితం సెషన్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగినప్పటికీ మొత్తానికి ఇటీవలి కాలంలో మాత్రం భారీగా తగ్గాయి. నిన్న (11, మే 2022) సమయానికి జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ 209 పెరిగి రూ.50,795 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.187 పెరిగి రూ.51,088 వద్ద ముగిసింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.172 పెరిగి రూ.60,790 వద్ద, సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.174 పెరిగి రూ.61,497 వద్ద ముగిసింది.
నేడు కూడా స్వల్పంగా పెరిగింది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ప్రారంభ సమయంలో రూ.45 పెరిగి రూ.50,867 వద్ద ఉంది. అయినప్పటికీ రూ.51,000కు దిగువనే ఉంది. సిల్వర్ ఫ్యూచర్ మాత్రం తగ్గింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.282 తగ్గి రూ.60,470 వద్ద ఉంది. వెండి రూ.60,500 దిగువకు వచ్చింది.

అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో బంగారం, వెండి ధరలు క్షీణించాయి. ఈ వార్త రాసే సమయానికి గోల్డ్ ఫ్యూచర్స్ 3 డాలర్లు క్షీణించి 1850 డాలర్ల వద్ద, సిల్వర్ 0.178 డాలర్లు ఎగిసి 21,397 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1853 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 21.575 డాలర్ల వద్ద ముగిసింది. నేడు మరింతగా తగ్గింది.
బంగారం ధరలు మూడు నెలల కనిష్టాన్ని తాకాయి. ఇన్వెస్టర్లు అమెరికా నెలవారీ ద్రవ్యోల్భణం డేటాకు ముందు అప్రమత్తంగా ఉన్నారు. బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే రూ.5000కు తక్కువగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టం 2075 డాలర్లతో పోలిస్తే 275 డాలర్లు తక్కువగా ఉంది.


Click it and Unblock the Notifications