బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు (జూలై 30) ఎంసీఎక్స్‌లో ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 0.21 శాతం ఎగిసి రూ.53,300 పలికింది. అంతకుముందు సెషన్‌లో రూ.730 (1.4 శాతం) పెరిగింది. నిన్న ఓ సమయంలో రూ.53,399తో ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది. వెండి నిన్న కిలో 0.5 శాతం ఎగిసింది. ఈ రోజు స్వల్పంగా తగ్గుముఖం పట్టింది.

పది రోజుల్లో రూ.5,500 పెరిగిన బంగారం
కరోనా మహమ్మారి నేపథ్యంలో గత కొంతకాలంగా బంగారం ధర భారీగా పెరుగుతోంది. కొద్ది రోజుల క్రితం పెరుగుదల తగ్గుముఖం పట్టినప్పటికీ గత పది రోజులుగా మళ్లీ పుంజుకుంది. నిన్న ప్రారంభంలో స్వల్పంగా తగ్గినప్పటికీ, ఆ తర్వాత కోలుకుంది. గత పది రోజుల్లో బంగారం ధర ఏకంగా రూ.5,500 (11 శాతం) పెరిగింది.

ఢిల్లీలో రూ.53,000, హైదరాబాద్‌లో రూ.55,000 క్రాస్
బంగారం ధరలు నిన్న ప్రారంభంలో స్వల్పంగా తగ్గినప్పటికీ ఆ తర్వాత తిరిగి పుంజుకున్నాయి. ఈ రోజు పెరుగుదలతో బంగారం వరుసగా పదో రోజు కూడా పెరిగింది. బుధవారం ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.710 పెరిగి రూ.53,797కు చేరుకుంది. కిలో వెండి రూ.313 ఎగిసి రూ.65,540 పలికింది. హైదరాబాద్‌లో బుధవారం 24 క్యారెట్ల బంగారం ధర రూ.55,300 పైచిలుకు పలికింది. కిలో వెండి రూ.66,700 పలికింది.

అంతర్జాతీయ మార్కెట్లో..
గత తొమ్మిది రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లోనూ ఎగిసిపడుతున్న బంగారం ధరలు తాజాగా కాస్త ఊరటనిచ్చాయి. స్పాట్ గోల్డ్ 0.3 శాతం తగ్గి ఔన్స్ 1,965.90 పలికింది. మంగళవారం 1,981 డాలర్లతో ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది. ఇక, గోల్డ్ ఫ్యూచర్స్ 0.2 శాతం ఎగిసి 1,981.60 వద్ద ట్రేడ్ అయింది. 2000 డాలర్లకు సమీపంలో ఉంది. వెండి 0.2 శాతం తగ్గి ఔన్స్ 24.614 డాలర్లు పలికింది.

బంగారం@2,300 డాలర్లు
గోల్డ్‌మన్ సాక్స్ బంగారం ధరలు త్వరలో ఔన్స్ 2,300 డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తోంది. బంగారం ఈ వారమే 2,000 డాలర్లు దాటినా ఆశ్చర్యం లేదని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఇతర అతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే ప్లాటినమ్ 0.38% పడిపోయి 923.5 డాలర్లు పలికింది.
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications