బంగారం ధరలు వరుసగా రెండు రోజులుగా పెరుగుతున్నాయి. డాలర్ వ్యాల్యూ క్షీణించడం, అమెరికా ఫెడ్ రిజర్వ్ పాలసీ మీట్‌పై దృష్టి, కరోనా కేసులు పెరుగుతుండటం వంటి వివిధ కారణాలు పసిడి పైన ఒత్తిడిని పెంచాయి. ఎంసీఎక్స్‌లో ఈరోజు(సెప్టెంబర్ 15) పసిడి ధరలు 0.30 శాతం( రూ.200కు పైగా) పెరిగి రూ.51,890 పలికింది. చాలా రోజులకు తిరిగి రూ.52,000 దిశగా కనిపిస్తోంది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.67 శాతం (రూ.460కి పైగా) పెరిగి కిలో రూ.69,428 పలికింది. వెండి కూడా చాలా రోజుల తర్వాత రూ.70వేల దిశగా సాగుతోంది. పసిడి ఈ రెండు రోజుల్లో రూ.500కు పైగా పెరిగింది.

నిన్న కూడా పెరిగిన ధరలు
సోమవారం కూడా పసిడి, వెండి లాభాల్లో సెటిల్ అయ్యాయి. అంతర్జాతీయ, దేశీయ ఈక్విటీ మార్కెట్లు, డాలర్ క్షీణత వంటి వివిధ కారణాలతో డొమెస్టిక్ గోల్డ్, సిల్వర్ ఫ్యూచర్స్‌కు మద్దతు లభించింది. నిన్న మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో గోల్డ్ ఫ్యూచర్స్ అక్టోబర్ రూ.361(0.70 శాతం) పెరిగి రూ.51,680 పలికింది. సిల్వర్ ఫ్యూచర్స్ డిసెంబర్ కిలో రూ.607(0.89 శాతం) రూ.68,535 పలికింది. గత సెషన్‌లో గోల్డ్, సిల్వర్ కాంట్రాక్ట్‌లు వరుసగా ఓ సమయంలో రూ.51,736, రూ.68,720 స్థాయికి కూడా వెళ్లింది. అయితే నిన్న ఢిల్లీ బులియన్ మార్కెట్లో మాత్రం ఈ రోజు 10 గ్రాముల బంగారం అతి స్వల్పంగా రూ.24 తగ్గి రూ.52,465 పలికింది. వెండి ధరలు రూ.222 పెరిగి కిలో రూ.69,590కి చేరుకుంది.

అంతర్జాతీయ మార్కెట్లోను పెరిగిన ధరలు
అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి ధరలు పెరిగాయి. స్పాట్ గోల్డ్ 0.3 శాతం పెరిగి ఔన్స్ 1,962.78 పలికింది. అంతకుముందు సెషన్‌లో 0.8 శాతం పెరిగింది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.5 శాతం పెరిగి ఔన్స్ 1,972.60 పలికింది. డాలర్ క్షీణత, ఫెడ్ రిజర్వ్ పాలసీకి తోడు కరోనా కేసులు పెరగడంతో బంగారం ధరలు పెరుగుతున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఇతర అతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే ప్లాటినమ్ 0.5 శాతం పెరిగి 958.48 డాలర్లుగా ఉంది. ఆగస్ట్ 18న 966 డాలర్లతో ఆల్ టైమ్ గరిష్టం పలికింది. వెండి 0.7 శాతం ఎగిసి 27.35 డాలర్లు పలికింది. పల్లాడియం 0.3 శాతం పెరిగి 2,318.80 పలికింది.

ధరలు ఎలా ఉండవచ్చు
వ్యాక్సీన్ ప్రకటన వస్తే పసిడి ధరలు తిరిగి భారీగా తగ్గే అవకాశముందని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అయితే అప్పటి వరకు స్వల్పంగా పైకి, కిందకు కదులుతూనే ఉంటుందని అంటున్నారు. పసిడి ధరలు 2000 డాలర్లకు తిరిగి చేరుకుంటే ఆ తర్వాత వేగంగా 2100 డాలర్ల దిశగా వెళ్లవచ్చునని అంటున్నారు. ఆ తర్వాత పడిపోయి పుంజుకుంటే 2500 డాలర్ల దిశగా వెళ్తుందని అంటున్నారు. అదే జరిగితే ఎంసీఎక్స్‌లో తిరిగి రూ.54 వేల దిశగా వెళ్తుంది. అయితే వ్యాక్సీన్ ప్రకటన వస్తే మాత్రం భారీగా తగ్గే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications