ఈ నెలలో రూ.2,000 పెరిగిన బంగారం ధరలు, వెండి ఎంత ఉందంటే?
బంగారం, వెండి ధరలు నేడు దాదాపు స్థిరంగా ఉన్నాయి. ఈవారం ప్రారంభ సెషన్‌లోనే గోల్డ్ ఫ్యూచర్స్ అతి స్వల్పంగా పెరిగింది. ఈ నెలలో బంగారం రూ.2000 పెరిగింది. వెండి ధరలు కూడా రూ.200కు పైగా పెరిగాయి. గత ఏడాది ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే పసిడి రూ.7800 తక్కువగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. గోల్డ్ ఫ్యూచర్స్ 1900 డాలర్ల పైనే ట్రేడ్ అవుతోంది. సిల్వర్ ఫ్యూచర్స్ 28 డాలర్ల పైనే కదలాడుతోంది.

మళ్లీ తగ్గిన పసిడి
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు మధ్యాహ్నం సెషన్లో రూ.143.00 (0.29%) పెరిగి రూ.48685.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,690.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,717.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.48,540.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.171.00 (0.35%) పెరిగి రూ.49321.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,193.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,368.00 గరిష్టాన్ని, రూ.49,193.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.72,000 దిశగా వెండి
జూలై సిల్వర్ ఫ్యూచర్స్ నేడు మధ్యాహ్నం సెషన్లో రూ.221.00 (0.31%) పెరిగి రూ.71832.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.72,000.00 వద్ద ప్రారంభమై, రూ.72,144.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.71,811.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.234.00 (0.32%) పెరిగి రూ.73000.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.73,318.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.73,326.00 గరిష్టాన్ని, రూ.72,998.00 కనిష్టాన్ని తాకింది

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లోను బంగారం ధరలు పెరిగాయి. 1900 డాలర్లకు పైనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 3.75
(+0.20%) డాలర్లు తగ్గి 1,909.05 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,905.50 - 1,913.40 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. 0.091 (0.32%) డాలర్లు తగ్గి 28.105 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 28.032 - 28.258 డాలర్ల మధ్య కదలాడింది.


Click it and Unblock the Notifications