Gold prices today: పెరిగిన బంగారం ధరలు, తగ్గిన వెండి ధరలు
బంగారం ధరలు నేడు(ఫిబ్రవరి 9, మంగళవారం) పెరిగాయి. వరుసగా 3 సెషన్లలో పసిడి ధరలు పెరగడంతో నేడు రూ.48,000 మార్కును దాటింది. బడ్జెట్ ప్రకటన అనంతరం ధరలు క్షీణించాయి. ఓ సమయంలో రూ.47,000 దిగువకు వచ్చిన ధరలు, పెరుగుతున్నాయి. అయితే స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. మధ్యాహ్నం సెషన్‌లో ఓసారి 48,235 కూడా పలికింది. ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో చూస్తే రూ.8200 తక్కువగా ఉన్నాయి. ఇక సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.70,000 దిగువకు వచ్చింది.

బంగారం 48,000 దిగువకు
ఎంసీఎక్స్‌లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ఉదయం రూ.116.00 (0.24%) పెరిగి రూ.47,955.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,000.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,235.00 వద్ద గరిష్టాన్ని, రూ.47,779.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.8200 వరకు తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.169.00 (0.35%) పెరిగి రూ.48,114 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,166.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,328.00 వద్ద గరిష్టాన్ని, రూ.47,913.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి రూ.70వేల దిగువకు
వెండి ధర స్వల్పంగా తగ్గి, రూ.70వేల దిగువకు చేరింది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో 624.00 (-0.89%) తగ్గి రూ.69,460.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.70,297.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.70,757.00 వద్ద గరిష్టాన్ని, రూ.69,00000 వద్ద కనిష్టాన్ని తాకింది.
మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా కిలో రూ.440.00 (0.62 శాతం) తగ్గి రూ.70700.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.71,250.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.71,755.00 వద్ద గరిష్టాన్ని, రూ.70,122.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1850 డాలర్ల దిశగా..
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర పెరిగింది. అయితే 1840 డాలర్లకు దిగువనే ఉంది. నేడు గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 5.35 (+0.29%) డాలర్లు పెరిగి 1839.55 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,830.35 - 1,849.45
డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 15.2% శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం స్వల్పంగా తగ్గింది. ఔన్స్ ధర 0.218
(-0.79%) డాలర్లు పెరిగి 27.358 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 27.137 - 27.872 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 55.24 శాతం పెరిగింది.


Click it and Unblock the Notifications