భారీగా పెరిగిన బంగారం ధర, రూ.50,000 దిశగా...: షాకిచ్చిన వెండి, 2 రోజుల్లో రూ.2500 జంప్
ముంబై: బంగారం ధరలు పెరుగుతున్నాయి. కరోనా వ్యాక్సీన్ ప్రకటన వచ్చినప్పటికీ ధరలు పైపైకి చేరుకుంటున్నాయి. దేశీయ, అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో పసిడి లాభపడింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల ధర రూ.50,000 దిశగా వెళ్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ పసిడి 1870 డాలర్ల వైపు సాగుతోంది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే రూ.6600 తక్కువగా ఉంది. గత నెల రోజులుగా పసిడి ధరలు రూ48,000 నుండి రూ.50వేల మధ్య కదలాడుతున్నాయి.

పెరిగిన బంగారం ధర
మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో 10 గ్రాముల ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.191.00 (0.39%) పెరిగి రూ.49634.00 వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో రూ.49,510.00 వద్ద ప్రారంభమై, రూ.49,850.00 గరిష్టాన్ని తాకి, రూ.49,452.00 కనిష్టాన్ని తాకింది. గత పది రోజుల్లో పసిడి రూ.48వేల దిగువ నుండి రూ.49,600 దాటి, రూ.50,000 దిశగా పయనిస్తోంది.
ఏప్రిల్ ఫ్యూచర్స్ రూ.242.00 (0.49%) ఎగిసి రూ.49704.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,666.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,900.00 వద్ద గరిష్టాన్ని, రూ.49,511.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

భారీగా పెరిగిన వెండి ధర
సిల్వర్ ఫ్యూచర్స్ రెండు రోజుల్లో రూ.2500 వరకు పెరిగింది. కిలో మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1,227.00 (1.89%) పెరిగి రూ.66080.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.65,000.00 ప్రారంభమైన ధర, రూ.66,800.00 గరిష్టాన్ని, రూ.65,000.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మే ఫ్యూచర్స్ రూ.1,378.00 (2.10%) పెరిగి రూ.67,000.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.66,031.00 ప్రారంభమైన, రూ.67,530.00 వద్ద గరిష్టాన్ని, రూ.66,000.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో..
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ పసిడి 1.45 (+0.08%) డాలర్లు పెరిగి 1,856.75 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,852.65 - 1,869.45 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి 23.18% పెరిగింది.
కామెక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ ఔన్స్ 0.434 (+1.76%) డాలర్లు పెరిగి 25.078 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 24.578 - 25.485 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 42.58% పెరిగింది.


Click it and Unblock the Notifications