పెరిగిన బంగారం ధరలు, ఆల్‌టైం గరిష్టంతో రూ.8200 తక్కువ
ముంబై: బంగారం ధరలు నేడు కూడా పెరిగి 10 గ్రాముల పసిడి రూ.48,000 దాటింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.8200 తక్కువగా ఉంది. నిన్న ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.91.00 (0.19%) పెరిగి రూ.47,930.00 వద్ద, జూన్ ఫ్యూచర్స్ రూ.135.00 (0.28%) పెరిగి రూ.48,080.00 వద్ద క్లోజ్ అయింది. నిన్నటి సెషన్లో రూ.48వేల పైకి చేరుకున్నప్పటికీ, సాయంత్రం సెషన్లో కాస్త తగ్గింది. సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి రూ.508.00 (0.72%) తగ్గి రూ.69576.00 వద్ద క్లోజ్ అయింది. ఓ సమయంలో రూ.70వేల పైకి చేరుకున్నప్పటికీ, ఆ తర్వాత తగ్గింది. సిల్వర్ ఫ్యూచర్స్ రూ.70వేలకు దిగువనే ముగిసింది.

బంగారం 48,000 పైకి
ఎంసీఎక్స్‌లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ఉదయం రూ.117.00 (0.24%) పెరిగి రూ.48,065.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,000.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,110.00 వద్ద గరిష్టాన్ని, రూ.48,000.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.8200 వరకు తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.20.00 (0.04%) పెరిగి రూ.48,080 వద్ద ట్రేడ్ అయింది.

వెండి రూ.70వేల దిగువనే
వెండి ధర నిన్న స్వల్పంగా తగ్గి, రూ.70వేల దిగువకు చేరింది. నేడు పెరిగినప్పటికీ ఆ మార్కుకు దిగువనే ఉంది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో 188.00 (0.27%) పెరిగి రూ.69,884.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,940.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.69,940.00 వద్ద గరిష్టాన్ని, రూ.69,767.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా కిలో రూ.167.00 (0.24 శాతం) పెరిగి రూ.70945.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.70,931.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.70,945.00 వద్ద గరిష్టాన్ని, రూ.70,866.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1840 డాలర్ల పైకి పసిడి
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర పెరిగింది. అయితే 1840 డాలర్ల పైకి చేరుకుంది. నేడు గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 7.45 (+0.41%) డాలర్లు పెరిగి 1844.95 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,834.50 - 1,846.00 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 14.76 శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం స్వల్పంగా పెరిగింది. ఔన్స్ ధర 0.98 (0.36%) డాలర్లు పెరిగి 27.500 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 27.230 - 27.555
డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 52.330 శాతం పెరిగింది.


Click it and Unblock the Notifications