ముంబై: బంగారం ధరలు శుక్రవారం (డిసెంబర్ 4) పెరిగాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.49వేలు క్రాస్ చేసింది. గతవారం రూ.48వేల దిగువకు వచ్చిన పసిడి ఇప్పుడు రూ.50వేల సమీపానికి చేరుకుంది. ప్రారంభ సెషన్‌లో పెరిగిన బంగారం ధర ఆ తర్వాత కాస్త క్షీణించింది. అయినప్పటికీ రూ.49వేలపైన ఉంది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పసిడి రూ.7,000 తక్కువగా ఉంది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.63,000 క్రాస్ చేసింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.79వేలతో రూ.17వేలు తక్కువగా ఉంది.

ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7000 డౌన్
ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్ రూ.22.00 (-0.04%) క్షీణించి రూ.49,280 పలికింది. 49,415.00 వద్ద ప్రారంభమై, ఇదే ధర వద్ద గరిష్టాన్ని తాకింది. రూ.49,258.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఉదయం బంగారం రూ.200కు పైగా పెరిగినప్పటికీ, ఆ తర్వాత క్షీణించింది. గత నాలుగు రోజుల్లో రూ.1500కు పైగా పెరిగింది.
ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.169.00 (0.34%) పెరిగి రూ.49,421 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,460.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,460.00 గరిష్టాన్ని, రూ.49,460.00 కనిష్టాన్ని తాకింది.

వెండి అతి స్వల్పంగా..
సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి అతి స్వల్పంగా రూ.20.00 (0.03%) పెరిగి రూ.63,650.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.63,722.00 ప్రారంభమై, రూ.63,856.00 గరిష్టాన్ని, రూ.63,585.00 కనిష్టాన్ని తాకింది.
మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.370.00 (0.58%) పెరిగి రూ.64,600 వద్ద ట్రేడ్ అయింది. రూ.64,600.00 వద్ద ప్రారంభమైన ధర ఉదయం నుండి అదే స్థాయిలో ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో..
అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి ధరలు పెరిగాయి. ఔన్స్ 1850 డాలర్లకు చేరువలో ఉంది. 2.35 (+0.13%) డాలర్లు పెరిగి 1,843.45 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేడు 1,841.45 - 1,848.25 డాలర్ల స్థాయిలో ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 1,841.10 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో 22.51% శాతం మేర పెరిగింది.
వెండి ధరలు 0.061 (+0.25%) డాలర్లు పెరిగి 24.195 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 24.078 - 24.258 డాలర్ల స్థాయిలో ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 24.137 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో 41.15 శాతం పెరిగింది.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Akshaya Tritiya: అక్షయ తృతీయ ఏ రోజు? కన్ఫ్యూజన్ వద్దు.. అసలైన ముహూర్తం ఇదే!

Today Gold Silver Rate Live: ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటన దెబ్బకు భారీగా పెరిగిన బంగారం ధరలు

Gold: బంగారంపై రుణం కావాలా? గోల్డ్ లోన్ కంటే ఇదే బెస్ట్.. తక్కువ వడ్డీకే డబ్బు!

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 7, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Gold silver: బంగారం, వెండి కొనేవారికి అలర్ట్.. ఈ వారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే!

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..



Click it and Unblock the Notifications