దేశీయ, అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో పసిడి, వెండి ధరలు సోమవారం (అక్టోబర్ 12) పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం ఊగిసలాటలో ఉన్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ఉదయం 0.4 శాతం పెరిగి రూ.51,016 పలికింది. రాత్రి ఎనిమిది గంటల సమయానికి 0.51 శాతం పెరిగి రూ.51,075 పలికింది. ఫ్యూచర్ మార్కెట్లో 10 గ్రాముల పసిడి చాలా రోజుల తర్వాత రూ.51వేల మార్క్ వద్ద క్లోజ్ అయ్యేలా కనిపిస్తోంది. ఉదయం రూ.50,940 వద్ద ప్రారంభమైంది. ఓ సమయంలో రూ.51,184 గరిష్టాన్ని తాకింది.

బంగార ధర పెరిగింది.. ఆల్ టైమ్ హైతో రూ.5,000 తక్కువ
ఆగస్ట్ 7 ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పసిడి ధర ఇప్పటికీ రూ.5,000 తక్కువ పలుకుతోంది. డిసెంబర్ ఫ్యూచర్స్ రూ.51,075 పలకగా, ఫిబ్రవరి ఫ్యూచర్స్ 10 గ్రాములు రూ.51,205 పలికింది. 0.48 శాతం లేదా రూ.246 పెరిగింది. రూ.51,140 వద్ద ప్రారంభమైన ధర ఓ సమయంలో రూ.51,332 గరిష్టాన్ని తాకింది. ఇక కిలో వెండి ఫ్యూచర్స్ (డిసెంబర్) 0.01 శాతం లేదా రూ.9 పెరిగి రూ.62,893 పలికింది. ఓ సమయంలో వెండి రూ.64,122 వద్ద గరిష్టాన్ని తాకింది. మార్చి ఫ్యూచర్స్ 0.09 శాతం లేదా రూ.59 పెరిగి కిలో రూ.64,786 పలికింది. మార్చి ఫ్యూచర్స్ రూ.65,876 వద్ద గరిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో ధరలు...
అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో పసిడి ఔన్స్ 0.19 శాతం పెరిగి ధర 1,930 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో గతవారం ఔన్స్ పసిడి 1,936 డాలర్లను తాకింది. 1926 వద్ద క్లోజ్ అయ్యాయి. కామెక్స్‌లో 1,898.10 డాలర్ల నుండి 1,936.80 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. ఈ రోజు అతిస్వల్పంగా 0.19 శాతం పెరిగింది. ఔన్స్ పసిడి గరిష్టం 1939 డాలర్లు తాకింది. ఇప్పటి వరకు 1,924.05 డాలర్ల నుడి 1,939.35 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. ఏడాదిలో పసిడి ధరలు 27 శాతం పెరిగాయి. సిల్వర్ ఫ్యూచర్స్ 25 డాలర్లను తాకింది. ఈ రోజు 0.33 శాతం లాభపడి 25.190 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

బులియన్ మార్కెట్లో..
గత నాలుగు రోజులుగా పసిడి ధరలు పెరగడంతో బులియన్ మార్కెట్లోనూ అదే దారిలో పయనించాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖలలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.53,250, 22 క్యారెట్ల పసిడి రూ.48,820 పలికింది. ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రూ.53,970, 22 క్యారెట్ల బంగారంరూ.49,600కు చేరుకుంది.
More From GoodReturns

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

బంగారం ధరలు కాస్త శాంతించాయి.. లక్షా యాభై వేల రూపాయల దిగువకు.. మార్చి 21, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. మార్చి 23, సోమవారం ధరలు ఇవే..

వెండి ధర రూ. 3 లక్షలు.. బంగారం ధర 10 గ్రాములు రూ. 1. 72 లక్షలు.. షాకిస్తున్న ఆర్థిక నిపుణులు అంచనాలు..

బంగారం ధరలు తగ్గినా.. లాభాలు రావాలంటే ఈ రేటుకు దిగేదాకా ఆగాల్సిందే.. ఆర్థిక నిపుణులు కీలక సూచన..

బంగారం, వెండి ధరలు ఢమాల్.. గ్యాస్ ధరలు హడల్.. గ్లోబల్ మార్కెట్లో అసలేమి జరుగుతోంది..

బంగారం ధరలు తగ్గాయి.. అయినా కొనుగోలు చేసే ముందు ఆలోచించుకోండి.. మార్చి 18, బుధవారం ధరలు ఇవే..

భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు, కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం



Click it and Unblock the Notifications