గతవారం మొత్తంగా తగ్గిన పసిడి ధరలు, చివరి సెషన్లో మాత్రం పెరిగాయి. ఈ రోజు (ఫిబ్రవరి 8, సోమవారం) కూడా భారీగా పెరిగాయి. పసిడి ధర రూ.600కు పైగా పెరిగినప్పటికీ, రూ.48000ని క్రాస్ చేశాయి. బడ్జెట్ ప్రకటన అనంతరం పసిడి ధరలు భారీగా క్షీణించాయి. రూ.2000కు పైగా తగ్గాయి. ఓ సమయంలో రూ.47,000 దిగువకు వచ్చాయి. గతవారం చివరి సెషన్లో రూ.47,000 దాటాయి. నేడు ప్రారంభ సెషన్లో పడిపోయిన ధరలు, ఆ తర్వాత పెరిగాయి. ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో చూస్తే రూ.8200 తక్కువగా ఉన్నాయి. బంగారం ధరలు ఈవారం కూడా కాస్త పైకి చేరే అవకాశాలు లేకపోలేదని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

బంగారం భారీగా జంప్
ఎంసీఎక్స్‌లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు (సోమవారం, ఫిబ్రవరి 8వ తేదీ) ఉదయం రూ.688.00 (1.45%) పెరిగి రూ.48,022.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,152.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,957.00 వద్ద గరిష్టాన్ని, రూ.47,152.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.8200 వరకు తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.688.00 (1.45%) పెరిగి రూ.48,022 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,257.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,050.00 వద్ద గరిష్టాన్ని, రూ.47,237.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి రూ.1200 జంప్
వెండి ధర కూడా పెరిగి రూ.70వేలను క్రాస్ చేసింది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.1,281.00 (1.86%) పెరిగి రూ.70,019.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,700.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.70,354.00 వద్ద గరిష్టాన్ని, రూ.68,420.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా రూ.1,299.00 (1.86%) పెరిగి రూ.71100.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,597.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.71,385.00 వద్ద గరిష్టాన్ని, రూ.69,496.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

భారీగా జంప్
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర భారీగా పెరిగి 1850 డాలర్ల దిశగా దూసుకెళ్తోంది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ +23.20 (1.28%) డాలర్లు పెరిగి 1836.20 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,807.35 - 1,840.45 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 13.77% శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. ఔన్స్ ధర +0.541 (2.00%) డాలర్లు పెరిగి 27.560 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.933 - 27.680 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 52.264 శాతం పెరిగింది.
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనేవారికి అలర్ట్.. ఈ వారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే!

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

Silver: వెండి ధర కిలో రూ.2 లక్షల కంటే కిందకు పడిపోదా? నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..



Click it and Unblock the Notifications