Gold prices today: బంగారం ధరలు పెరిగాయి కానీ ఆ మార్క్‌కు దిగువనే

ముంబై: గత కొద్దిరోజులుగా పైకీ కిందకు కదులుతున్న పసిడి ధరలు నేడు (బుధవారం, జనవరి 13) స్వల్పంగా పెరిగాయి. నేడు పసిడి ధరలు రూ.300 మధ్య మాత్రమే పైకి కిందకు కదలాడాయి. పసిడి ధరలు ఇప్పటికీ రూ.50,000కు దిగువనే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా పసిడి రూ.52వేల దిగువ నుండి రూ.48,000 పైన కదలాడుతున్నాయి. డాలర్ క్షీణించడం, యూఎస్ ట్రెజరీ యీల్డ్స్ తక్కువగా ట్రేడ్ కావడంతో బంగారం ధరలపై ప్రభావం పడింది. అమెరికా ఆర్థిక ప్యాకేజీ కూడా ఉంది. పసిడి ధరలు ఇప్పటికీ ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో రూ.7000 వరకు తక్కువగా ఉంది.

బంగారం రూ.49,5000కు దిగువనే

బంగారం రూ.49,5000కు దిగువనే

నేడు ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 257.00 (0.52%) పెరిగి రూ49302.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,130.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,447.00 వద్ద గరిష్టాన్ని, రూ.49,130.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.700 వరకు తక్కువగా ఉంది.

ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.273.00 (0.56%) పెరిగి రూ.4937.00 వద్ద ప్రారంభమైంది. రూ.49,323.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,467.00 వద్ద గరిష్టాన్ని, రూ.49,201.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి ధర స్వల్పంగా డౌన్

వెండి ధర స్వల్పంగా డౌన్

ఉదయం పెరిగిన వెండి ధరలు సాయంత్రం నాటికి స్వల్పంగా తగ్గాయి. ఉదయం రూ.400 వరకు పెరిగిన సిల్వర్ ఫ్యూచర్స్, సాయంత్రానికి రూ.14 వరకు తగ్గింది. దీంతో పసిడి రూ.66,000 దిగువకు వచ్చింది. కిలో సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి 14.00 (-0.02%) తగ్గి రూ.65892.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.66,500.00 వద్ద ప్రారంభమై, రూ.66,500.00 వద్ద గరిష్టాన్ని, రూ.66,168.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

మే సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం పెరిగింది. అయితే ఉదయం కంటే తగ్గింది. రూ.132.00 (0.20%) పెరిగి రూ.66816.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,177.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.67,300.00 వద్ద గరిష్టాన్ని, రూ.66270.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అక్కడ 1850 డాలర్ల పైకి

అక్కడ 1850 డాలర్ల పైకి

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర 1850 డాలర్ల పైకి చేరుకుంది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 13.30 (+0.72%) డాలర్లు పెరిగి 1,857.50 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,849.35 - 1,862.70 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 17.64% శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. ఔన్స్ ధర 0.100 (+0.39%) డాలర్లు తగ్గి 25.535 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.198 - 25.785 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 40.09 శాతం పెరిగింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+