బంగారం ధరలు ఈ రోజు స్వల్పంగా పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో అక్టోబర్ ఫ్యూచర్స్ 10 గ్రాములు 0.14 శాతం ఎగిసి రూ.51,340 పలికింది. వెండి ఫ్యూచర్స్ 0.44 శాతం పెరిగి కిలో రూ.65,860 పలికింది. అంతకుముందు సెషన్‌లో పసిడి 10 గ్రాములు 1.4 శాతం లేదా రూ.750 పడిపోయింది. వెండి 2.6 శాతం లేదా రూ.1,750 క్షీణించింది. వరుసగా నాలుగు రోజుల పాటు తగ్గిన ధరలు, ఈ రోజు స్వల్పంగా పెరుగుదలను నమోదు చేశాయి. కరోనా మహమ్మారి, ఆంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిన నేపథ్యంలో పసిడి ధరలు భారీగా పెరిగి, ఇటీవల అస్థిరంగా ఉన్నాయి.

ఈ నెల గరిష్టంతో బంగారం రూ.5,000, వెండి రూ.12వేలు తక్కువ
బంగారం ధరలు అస్థిరంగా ఉన్నప్పటికీ ఈ నెల గరిష్ట రికార్డుతో ఇప్పటికీ రూ.5,000 వరకు తక్కువే ఉంది. కాస్త అటుఇటుగా ఈ నెలలో ఈ మేరకు తగ్గింది. అదే సమయంలో కిలో వెండి ధర అయితే ఏకంగా రూ.78,000 నుండి రూ.66వేల దిగువకు చేరుకొని, రూ.12వేల తగ్గుదలను నమోదు చేసింది.

హైదరాబాద్‌లో పసిడి ధర
వివిధ నగరాల్లో పసిడి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో ఉదయం స్వల్పంగా రూ.44 పడిపోయి రూ.53,040 పలికింది. కిలో వెండి రూ.206 పడిపోి రూ.68,202 పలికింది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.54,600 దిగువలో ఉంది. 22 క్యారెట్ల పసిడి రూ.50,030గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో స్థిరంగా
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. ఔన్స్ పసిడి 1,933 డాలర్లు పలికింది. అమెరికా డాలర్, కరోనా కేసులు, ఈక్విటీ మార్కెట్లు, వ్యాక్సీన్, ట్రేడ్ వార్, భౌగోళిక పరిస్థితులు సహా వివిధ అంశాలపై పసిడి ధర ఆధారపడి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలకు ఊతమిచ్చేందుకు ఫెడ్ రిజర్వ్ సహా వివిధ కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను దాదాపు జీరోకు తగ్గించాయి. ఇతర అతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే వెండి 0.3 శాతం ఎగిసి ఔన్స్ 26.62 డాలర్లు, ప్లాటినమ్ 0.8 శాతం ఎగిసి 923.10 డాలర్లు, పల్లాడియం 1 శాతం పెరిగి 2,182.59 డాలర్లు పలికింది.


Click it and Unblock the Notifications