గత రెండు సెషన్‌లలో తగ్గిన బంగారం ధరలు ఈ రోజు (జూన్ 16, మంగళ వారం) పెరిగాయి. పసిడికి కొనుగోళ్ల మద్ధతు లభించింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX) గోల్డ్ ఫ్యూచర్స్ 0.32 శాతం లేదా రూ.150 పెరిగి రూ.47,176కు చేరుకుంది. వెండి ఫ్యూచర్స్ కిలో 0.61 శాతం లేదా రూ.287 పెరిగి రూ.47,680కి చేరుకుంది. గత సెషన్లో బంగారం ధర 0.64 శాతం, వెండి 0.8 శాతం తగ్గింది. గత నెలలో బంగారం ధర రూ.48,000కు చేరుకొని రికార్డ్‌స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే.

అంతర్జాతీయ మార్కెట్లో ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఫ్లాట్‌గా ఉన్నాయి. సెకండరీ మార్కెట్లో ఇండివిడ్యువల్ కార్పోరేట్ బాండ్స్ విక్రయిస్తామని ఫెడరల్ రిజర్వ్ ప్రకటించిన నేపథ్యంలో అమెరికా డాలర్ బలహీనపడింది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ స్పాట్ బంగారం ధర 1725.23 పలికింది. ఇతర అతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే ప్లాటినమ్ 0.7 శాతం పెరిగి 817.20 డాలర్లు, వెండి 0.4 శాతం తగ్గి 17.37 డాలర్లు పలికింది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.4 శాతం పెరిగి 1733 డాలర్లు పలికింది.

బంగారానికి మద్దతు
యూఎస్ డాలర్ ఇండెక్స్ ఇతర ఆరు కరెన్సీలతో పోలిస్తే 0.23% బలహీనపడింది. దీంతో ఈ కరెన్సీ కలిగిన దేశాల్లో బంగారం ధర కాస్త తగ్గింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్ర బ్యాంకులు ఆర్థిక ప్యాకేజీ వంటివి ప్రకటించిన సందర్భాల్లో కూడా బంగారానికి మద్దతు లభిస్తుంది. సమీప భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థలు అంతగా కోలుకునే పరిస్థితులు లేనందున బంగారానికి మద్దతు లభించవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

హైదరాబాద్‌లో రూ.50వేలకు సమీపంలో
సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు రూ.380 తగ్గింది. సాయంత్రానికి రూ.260 తగ్గింది. హైదరాబాద్, విశాఖలలో నిన్న సాయంత్రం రూ.200కు పైగా ధర తగ్గింది. ఈ రోజు మాత్రం అతి స్వల్పంగా రూ.10 పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,600, 22 క్యారెట్ల బంగారం రూ.45,330గా ఉంది. 24 క్యారెట్ల బంగారం రూ.50 వేలకు సమీపంలో ఉంది.

రానున్న రోజుల్లో మరింత పెరుగుదల
కరోనా మహమ్మారి, అంతర్జాతీయ పరిణామాల కారణంగా రానున్న కొద్ది రోజులు బంగారం ర్యాలీ చేయవచ్చునని నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 1733 డాలర్ల నుండి 1745 డాలర్ల మధ్య ప్రతిఘటన ఎదుర్కోవచ్చునని చెబుతున్నారు. ఇండియాలో రూ.47330-47500 ఉంటుందని చెబుతున్నారు.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications