బంగారం ధరలు పెరిగాయ్.. వెండిదీ అదే దారి: అందరిచూపు అటువైపే
గత కొద్ది రోజులుగా తగ్గుతున్న పసిడి ధరలు ఈ రోజు పెరుగుదలను నమోదు చేశాయి. మల్టీకమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో ఈరోజు (సెప్టెంబర్ 14, సోమవారం) ప్రారంభ సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములు 0.4 శాతం ఎగిసి రూ.51,532 పలికింది. వెండి ఫ్యూచర్స్ 0.6 శాతం ఎగిసి కిలో రూ.68,350 పలికింది. గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో 1 శాతం లేదా రూ.500కు పైగా తగ్గింది. వెండి కిలో 1.5 శాతం లేదా రూ.1,050 తగ్గింది. ఈరోజు బంగారం రూ.200కు పైగా పెరిగింది. ఆగస్ట్ 7వ తేదీన పసిడి 10 గ్రాములు రూ.56,200కు పైగా ఎగిసి ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది. వెండి కిలో రూ.79వేలకు చేరుకుంది.

డాలర్ దెబ్బ.. పెరిగిన ధరలు
సిక్స్ బాస్కెట్ కరెన్సీలో డాలర్ వ్యాల్యూ స్వల్పంగా క్షీణించింది. దీంతో పసిడి ధరలపై ప్రభావం చూపింది. ఇన్వెస్టర్లు ఫెడరల్ రిజర్వ్ పాలసీ మీటింగ్ వైపు ఆసక్తిగా చూస్తున్నారు. పసిడి ధరలు ఈ రోజు స్వల్పంగా పెరిగిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు పెరిగాయి. దీంతో పాటు దేశీయ మార్కెట్ పైన కూడా పడింది. దేశీయ మార్కెట్లో ఆగస్ట్ 7 ఆల్ టైమ్ గరిష్టం నుండి బంగారం ధరలు ఇప్పటికీ రూ.4,700 వరకు తక్కువగా ఉంది. వెండి కిలో రూ.10,000కు పైగా ఉంది.
ఫ్యూచర్ మార్కెట్లో గత పది రోజుల్లో పసిడి ధర రూ.500కు పైగా పెరగగా, నెల రోజుల్లో రూ.800 వరకు తగ్గింది. ఆగస్ట్ 14వ తేదీన పసిడి 10 గ్రాములు రూ.52,180 పలికింది. ఆగస్ట్ చివరి నాటికి రూ.51,300కు దిగి వచ్చింది. సెప్టెంబర్ ప్రారంభం నాటికి రూ.51వేల దిగువకు వచ్చింది. 4వ తేదీన రూ.50,740 పలికింది. ఈ రోజు రూ.51,500 పైకి చేరుకుంది.
అయినప్పటికీ ఈ ఏడాది ప్రారంభంతో పోలిస్తే పసిడి ధరలు ఇప్పటికీ 30 శాతం ఎక్కువగా ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు పెరిగాయి. స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర అతి స్వల్పంగా లేదా దాదాపు ఫ్లాట్‌గా ఉండి 1,941.11 డాలర్లు పలికింది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 1948.30 డాలర్లకు చేరుకుంది. సిల్వర్ ఔన్స్ ధర 26.68 డాలర్లు, ప్లాటినమ్ 0.4 శాతం పెరిగి 928.61 డాలర్లు పలికింది. ప్రధానంగా అమెరికా ఫెడ్ రిజర్వ్ మానిటరీ పాలసీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. వరల్డ్ లార్జెస్ట్ గోల్డ్ బ్యాక్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ SPDR గోల్డ్ ట్రస్ట్‌లో నిల్వలు శుక్రవారం నాటికి 0.4 శాతం పడిపోయి 1,248 టన్నులకు తగ్గింది.

బులియన్ మార్కెట్లో..
హైదరాబాద్, విశాఖ, విజయవాడల్లో బంగారం ధరలు ప్రారంభంలో ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పసిడి రూ.48,900, 24 క్యారెట్ల పసిడి రూ.53,400 దిగువన ఉంది. వెండి ధరలు కిలో రూ.68,000కు చేరువయ్యాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.48,900, 24 క్యారెట్ల పసిడి రూ.54,400గా ఉన్నాయి.


Click it and Unblock the Notifications