గత కొద్ది రోజులుగా రూ.45వేలకు దిగువనే ఉన్న పసిడి ధరలు, నిన్న రూ.44వేల దిగువకు కూడా వచ్చాయి. నేడు మాత్రం స్వల్పంగా పెరిగి తిరిగి రూ.44,000 మార్కును క్రాస్ చేశాయి. ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.12000 తక్కువగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో 1700 డాలర్ల దిగువకు వచ్చిన పసిడి నేడు తిరిగి ఆ మార్కును దాటింది. వెండి ధరలు కూడా దేశీయ, అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో స్వల్పంగా పెరిగాయి. కరోనా కేసులు పెరగడం, బిట్ కాయిన్ పైన అనుమానాలు వంటి వివిధ అంశాలు బంగారం పెరుగుదలకు దోహదపడ్డాయి.

రూ.400 పెరిగిన బంగారం
గోల్డ్ ఫ్యూచర్ నేడు (మార్చి 31, 2021) సాయంత్రం సెషన్‌లో పెరిగింది. ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.327.00 (0.75%) పెరిగి రూ.44,200.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.44,870.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.44,200.00 వద్ద గరిష్టాన్ని, రూ.43,711.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.12,000 తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా స్వల్పంగా పెరిగింది. రూ.345.00 (0.78%) పెరిగి రూ.44768.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.44,305.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.44,774.00 వద్ద గరిష్టాన్ని, రూ.44,215.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి రూ.300 పైకి
వెండి ధరలు నేడు సాయంత్రం సెషన్లో రూ.300 వరకు పెరిగాయి. మే సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.307.00 (0.49%) పెరిగి రూ.63431.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.62,800.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.63,578.00 వద్ద గరిష్టాన్ని, రూ.62,500.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. కిలో రూ.288.00 (-0.45%) తగ్గి రూ.64300.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.63,500.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.64,450.00 వద్ద గరిష్టాన్ని, రూ.63,456.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1700 డాలర్ల పైకి బంగారం
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు భారీగా పెరిగాయి. నిన్న భారీగా తగ్గగా, నేడు తిరిగి పుంజుకున్నాయి. ఏకంగా 25 డాలర్ల వరకు పెరిగాయి. కామెక్స్‌లో +24.70 (+1.47%) డాలర్లు తగ్గి 1,710.75 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,677.50 - 1,708.15 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ 24 డాలర్ల స్థాయిలోనే ఉంది. ఔన్స్ ధర 0.261
(+1.08%) డాలర్లు తగ్గి 24.398 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 23.793 - 24.418 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..

Gold silver: బంగారం, వెండి కొనేవారికి అలర్ట్.. ఈ వారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే!

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!



Click it and Unblock the Notifications