అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో క్రితం సెషన్‌లో భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు నేడు (డిసెంబర్ 3, శుక్రవారం) మళ్లీ పెరిగాయి. అయినప్పటికీ గోల్డ్ ఫ్యూచర్స్ 1775 డాలర్లకు దిగువనే ఉన్నాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో రూ.47,800కు దిగువన ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా రూ.61,200కు దిగువన ముగిసింది. క్రితం సెషన్‌లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.205 పెరిగి రూ.47,783 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.187 క్షీణించి రూ.61,120 వద్ద ముగిసింది. అయితే నేడు (డిసెంబర్ 3) డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.200 వరకు ఎగిసి రూ.47,595 వద్ద, ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.170 లాభపడి రూ.47,760 వద్ద ట్రేడ్ అయింది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.147 లాభపడి రూ.61,270 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.75 ఎగిసి రూ.61,760 వద్ద ట్రేడ్ అయింది. బంగారం ప్రస్తుతం ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో రూ.8700 వరకు తక్కువగా ఉంది.

బంగారం 1775 డాలర్ల దిగువనే బంగారం
అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో నేడు గోల్డ్ ఫ్యూచర్స్ 10 డాలర్ల మేర పెరిగి 1772 డాలర్లకు పెరిగింది. అంతకుముందు సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ ఏకంగా 1762 డాలర్ల స్థాయికి పడిపోయి, ముగిసింది. కానీ నేడు మాత్రం లాభపడింది. సిల్వర్ ఫ్యూచర్స్ క్రితం సెషన్లో 22.316 డాలర్ల వద్ద ముగియగా, నేడు 0.086 డాలర్లు లాభపడి 22.402 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. బంగారం ఏడాదిలో 4 శాతం తగ్గగా, వెండి 7 శాతం క్షీణించింది.

వరుసగా మూడో వారం డౌన్
బంగారం ధరలు నిన్న నెల రోజుల కనిష్టానికి పడిపోయాయి. అయితే నేడు కాస్త పుంజుకున్నాయి. గురువారం బంగారం ధరలు ఏకంగా 1 శాతం లేదా రూ.500 క్షీణించాయి. అంతర్జాతీయ మార్కెట్ అననుకూలతల నేపథ్యంలో పసిడి ధరలు క్షీణించాయి. బంగారం ధరలు వరుసగా మూడో వారం క్షీణించాయి. యూఎస్ సెంట్రల్ బ్యాంకు కీలక నిర్ణయాలు ఉంటాయనే వార్తల నేపథ్యంలో బంగారం ధరలు క్షీణిస్తున్నాయి.
దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం ఇటీవల రూ.50,000 దరిదాపుల్లోకి వెళ్లాయి. అంతర్జాతీయ మార్కెట్లో 1900 డాలర్ల సమీపానికి చేరుకున్నాయి. ఇప్పుడు దేశయ మార్కెట్లో రూ.47,700 దిగువన, అంతర్జాతీయ మార్కెట్లో 1775 డాలర్ల దిగువన ఉంది.

జాబ్ లెస్ క్లెయిమ్స్
డాలర్ వ్యాల్యూ క్రమంగా బలపడుతోంది. టెన్ ఇయర్ బాండ్ యీల్డ్స్ ప్రభావం కూడా పసిడి పైన కనిపిస్తోంది. జాబ్-లెస్ క్లెయిమ్స్ అంచనాలకు మించి క్రమంగా తగ్గుతున్నాయి. మరోవైపు ఆర్థిక రికవరీ కూడా వేగంగా కనిపిస్తోందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఒమిక్రాన్ ప్రభావం అంతగా లేదనే వాదనల నేపథ్యంలోను స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. ఈ ప్రభావం పసిడి పైన పడుతోంది.
More From GoodReturns

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Gold: రాబోయే 2 ఏళ్లలో బంగారంపై భారీ లాభాలు.. ఇన్వెస్టర్లు అప్రమత్తం!

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications