మూడ్రోజుల తర్వాత పెరిగిన బంగారం ధరలు, ఎంతంటే: వెండి రూ.70,000 పైకి...
ముంబై: బంగారం ధరలు వరుసగా మూడు రోజుల పాటు తగ్గిన అనంతరం, నేడు స్వల్పంగా పెరిగాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో(MCX) నిన్న రూ.47,300 దిగువ పలికిన పసిడి నేడు రూ.47,500కు సమీపంలో ఉంది. కరోనా నేపథ్యంలో గత ఏడాది ఆగస్ట్ 7న ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200 పలికిన గోల్డ్ ఫ్యూచర్స్ ఇప్పుడు దాదాపు రూ.9000 తగ్గుదలతో రూ.47,400కు పైన ఉంది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగి రూ.70,000ను క్రాస్ చేసింది. గత కొద్ది రోజులుగా పసిడి రూ.50,000కు దిగువనే ఉంది. వెండి మాత్రం ఇటీవలి కాలంలో కాస్త పుంజుకుంది.

బంగారం స్వల్పంగా పెరిగింది
ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో బంగారం ధర నేడు అతిస్వల్పంగా పెరిగింది. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ఉదయం సెషన్లో రూ.171.00 (0.36%) పెరిగి రూ.47,412.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,409.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,450.00 వద్ద గరిష్టాన్ని, రూ.47,341.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.8800 వరకు తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.161.00 (0.34%) పెరిగి రూ.47,543 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,525.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,590.00 వద్ద గరిష్టాన్ని, రూ.47,525.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

సిల్వర్ రూ.70,000 పైనే
వెండి ధరలు ఈ రోజు కూడా పెరిగాయి. ఎంసీఎక్స్‌లో కిలో వెండి రూ.70,000 క్రాస్ చేసింది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.271.00 (0.39%) పెరిగి రూ.70,400.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.70,510.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.70,864.00 వద్ద గరిష్టాన్ని, రూ.70,133.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా కిలో రూ.225.00 (0.32%) పెరిగి రూ.71,456.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.71,725.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.71,932.00 వద్ద గరిష్టాన్ని, రూ.71,351.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1820 డాలర్ల పైకి
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఔన్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 1820 డాలర్లకు పైకి వచ్చింది. నేడు గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 0.20
(0.01%) డాలర్లు పెరిగి 1823.40 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,817.70 - 1,826.85 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 14.83 శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. ఔన్స్ ధర +0.439
(1.61%) డాలర్లు పెరిగి 27.767 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 27.635 - 28.065 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 56.67 శాతం పెరిగింది.


Click it and Unblock the Notifications