For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీగా పెరిగి షాకిచ్చిన బంగారం, వెండి ధరలు: సిల్వర్ రూ.2,000కు పైగా జంప్

|

ముంబై: పసిడి ధరలు షాకిచ్చాయి. గత మూడువారాలుగా భారీగా క్షీణించిన బంగారం నేడు పెరిగింది. 48వేల దిగువకు వచ్చిన పసిడి, ఆ మార్కును క్రాస్ చేసింది. నిన్నటి వరకు 10 గ్రాముల ఫ్యూచర్ గోల్డ్ ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే రూ.8500 వరకు తక్కువ పలకగా, మంగళవారం (డిసెంబర్ 1) సాయంత్రం సెషన్ సమయానికి రూ.రూ.7,900 తక్కువగా ఉంది. బంగారం ధరలు రూ.500కు పైగా పెరిగాయి. వెండి ధరలు ఏకంగా రూ.2వేలకు పైగా పెరిగి రూ.59వేల నుండి రూ.61వేలకు ఎగబాకాయి.

రూ.500కు పైగా పెరిగిన బంగారం ధర

రూ.500కు పైగా పెరిగిన బంగారం ధర

మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో గోల్డ్ ఫ్యూచర్స్ డిసెంబర్ 10 గ్రాములు రూ.508.00 (1.06%) పెరిగి రూ.48,300.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,194.00 వద్ద ప్రారంభమై, రూ.48,559.00 వద్ద గరిష్టాన్ని, రూ.47,705.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.566.00 (1.18%) ఎగిసి రూ.48,484.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,097.00 ప్రారంభమైన ధర, రూ.48,640.00 వద్ద గరిష్టాన్ని, రూ.47,771.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.2వేలకు పైగా పెరిగిన వెండి

రూ.2వేలకు పైగా పెరిగిన వెండి

వెండి ధర ఏకంగా రూ.2వేలకు పైగా పెరిగింది. కిలో డిసెంబర్ ఫ్యూచర్స్ రూ.2,025.00 (3.43%) పెరిగి రూ.61147.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.59,908.00 వద్ద ప్రారంభమై, రూ.61,440.00 వద్ద గరిష్టాన్ని, రూ.59,512.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

మార్చి ఫ్యూచర్స్ రూ.2,316.00 (3.85%) పెరిగి రూ.62538.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.61,012.00 వద్ద ప్రారంభమై, రూ.62,760.00 వద్ద గరిష్టాన్ని, రూ.60,575.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

బంగారం, వెండి జంప్

బంగారం, వెండి జంప్

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి 1800 డాలర్ల పైకి చేరుకుంది. 30.35

(+1.70%) డాలర్లు పెరిగి 1,811.55 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 1,778.45 - 1,818.35 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 1,780.90 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో బంగారం 19 శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ +1.174 (+5.20%) డాలర్లు పెరిగి 23.773 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 22.670 - 23.823 మధ్య ట్రేడ్ అయింది. ఏడాదిలో 33 శాతం పెరిగింది. క్రితం సెషన్లో 22.593 డాలర్ల వద్ద ముగిసింది.

English summary

భారీగా పెరిగి షాకిచ్చిన బంగారం, వెండి ధరలు: సిల్వర్ రూ.2,000కు పైగా జంప్ | Gold prices today rise above Rs 48,000, Silver up Rs 2,000

Gold and silver futures prices were trading with gains in the morning trade on Tuesday amid rising covid cases and poor macro data coming out from the US that reduced hopes of a swift recovery.
Story first published: Tuesday, December 1, 2020, 22:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X