పెరిగిన బంగారం ధర: రూ.46,300 దాటిన పసిడి, వెండి రూ.70వేల దిశగా
బంగారం ధరలు క్రితం సెషన్లో పెరిగినప్పటికీ, మొత్తంగా గతవారం మాత్రం తగ్గాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ ఎంసీఎక్స్‌లో ఏకంగా రూ.46,200 దిగువకు పడిపోయింది. గతవారం భారీగా తగ్గిన బంగారం ధరలు ఈ వారం ప్రారంభంలోనే పెరుగుదలతో మొదలయ్యాయి. గతవారం ఓ సమయంలో రూ.46,000 దిగువకు కూడా పడిపోయాయి. నేడు బంగారం ధరలు రూ.46,300 కంటే పైకి చేరుకున్నాయి. అయినప్పటికీ రూ.46,500కు దిగువనే ఉంది. వెండి ధరలు కూడా ఉదయం సెషన్లో స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్వల్పంగా పెరిగినప్పటికీ 1790 డాలర్లకు దిగువనే ఉంది.

రూ.46,500 దిగువనే బంగారం
ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో బంగారం ధర నేడు ప్రారంభ సెషన్లో స్వల్పంగా పెరిగింది. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ఉదయం సెషన్లో రూ.123.00 (0.27%) పెరిగి రూ.46,320.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,335.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.46,366.00 వద్ద గరిష్టాన్ని, రూ.46,238.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.10,000 వరకు తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.92.00 (0.20%) పెరిగి రూ.46,432 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,460.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.46,460.00 వద్ద గరిష్టాన్ని, రూ.46,432.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.70వేల దిశగా వెండి
వెండి ధరలు ఈ రోజు రూ.500 వరకు పెరిగాయి. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.429.00 (0.62%) పెరిగి రూ.69,441.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,337.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.69,688.00 వద్ద గరిష్టాన్ని, రూ.69,319.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మే సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.401.00 (0.57%) పెరిగి రూ.70,560.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.70,657.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.70,828.00 వద్ద గరిష్టాన్ని, రూ.70,457.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1780 డాలర్ల పైకి పసిడి
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. నేడు 1782.35 డాలర్లకు చేరింది. ఉదయం సెషన్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 4.95
(+0.28%) డాలర్లు పెరిగి 1782.30 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,778.75 - 1,788.25 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 7.04 శాతం తగ్గింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. ఔన్స్ ధర 0.241
(+0.88%) డాలర్లు పెరిగి 27.495 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 27.405 - 27.782 డాలర్ల మధ్య కదలాడింది.


Click it and Unblock the Notifications