క్రితం సెషన్‌లో పెరిగిన పసిడి ధరలు నేడు (అక్టోబర్ 21, బుధవారం) ప్రారంభ సెషన్‌లోను అదే మార్గంలో నడిచాయి. ఉదయం గం.9.40 సమయానికి డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములు రూ.111(0.22 శాతం) తగ్గి రూ.51,021 వద్ద ట్రేడ్ అయింది. బంగారం మళ్లీ రూ.51వేల మార్క్ దాటింది. రూ.50,950 వద్ద ప్రారంభమైన ట్రేడింగ్, రూ.51,077 వద్ద గరిష్టం, రూ.50,950 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ 7వ తేదీన ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో ఇప్పటికీ రూ.5,000కు పైగా తక్కువ పలుకుతోంది. పండుగ సీజన్ సమీపిస్తున్న సమయంలో పసిడి ధరలు తిరిగి పెరగడం గమనార్హం. గోల్డ్ ఫిబ్రవరి ఫ్యూచర్స్ కూడా రూ.103(0.20 శాతం) పెరిగి రూ.51,035 వద్ద ట్రేడ్ అయింది.

బంగారం దారిలోనే వెండి పెరుగుదల
వెండి ఫ్యూచర్స్ కిలో రూ.348(0.55 శాతం) పెరిగి రూ.63,470వద్ద ట్రేడ్ అయింది. రూ.63,530 వద్ద ప్రారంభమై, రూ.63,591 వద్ద గరిష్టాన్ని, రూ.63,422వద్ద కనిష్టాన్ని తాకింది.
మార్చి ఫ్యూచర్స్ కిలో రూ.371 (0.57 శాతం) పెరిగి రూ.65,090 వద్ద ట్రేడ్ అయింది. రూ.65,085 వద్ద ప్రారంభమైన ధర, రూ.65090 వద్ద గరిష్టాన్ని, రూ.65,085 కనిష్టాన్ని తాకింది.
గోల్డ్ ఫ్యూచర్స్ ఆగస్ట్ నెలలో రూ.79వేలకు చేరుకుంది. ఈ ఆల్ టైమ్ గరిష్టంతో రూ.16వేల వరకు తక్కువగా ఉంది.

మళ్లీ పెరుగుదుల దిశగా...
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్ కామెక్స్‌లో కూడా గోల్డ్ ఫ్యూచర్స్ 0.37 శాతం పెరిగి ఔన్స్ 1,922.65 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 1,909.40 - 1,924.45 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 1915.40 డాలర్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో 6 డాలర్లకు పైగా పెరిగింది.
వెండి ఫ్యూచర్స్ ఔన్స్ ధర 0.93 శాతం లాభపడి 25.212 డాలర్లు పలికింది. 24.745 - 25.255 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 24.980 డాలర్ల వద్ద ముగిసింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ పసిడి ఆగస్ట్‌లో ఆల్ టైమ్ గరిష్టం 2075 డాలర్లతో పోలిస్తే 150 డాలర్లు తక్కువగా ఉంది. వెండి ఫ్యూచర్స్ 29 డాలర్లు దాటింది. ఆ ధరతో 5 డాలర్ల వరకు తక్కువ ఉంది.

ఆర్థిక ప్యాకేజీ ఆమోదానికి..
అమెరికా చట్టసభ సభ్యులు నవంబర్ 3వ తేదీ లోపు ఆర్థిక ప్యాకేజీకి అంగీకారం తెలిపే అవకాశాలు ఉన్నాయి.
సిక్స్ బాస్కెట్ కరెన్సీలో డాలర్ 0.14 శాతం క్షీణించింది. బంగారం ధరలపై ఈ ప్రభావం కూడా ఉంటుంది.
ఇక, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రూ.50,950 పలికింది.22 క్యారెట్ల పసిడి రూ.46,700 పలికింది. వెండి కిలో రూ.62వేల వరకు పలికింది.
More From GoodReturns

భారతీయుల ఇళ్లలో ఉన్న బంగారంపై షాకింగ్ న్యూస్.. 10 దేశాల కేంద్ర బ్యాంకుల నిల్వ కంటే ఎక్కువే..

ఈ ఏడాది బంగారం, వెండి పెరుగుదలపై సంచలన నివేదిక.. ఏకంగా ఆ స్థాయి వరకు వెళుతుందంటున్న నిపుణులు..

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

బంగారం, వెండి ధరలపై సస్పెన్స్.. ఆర్బీఐ నిర్ణయంతో రేట్లు తగ్గుతాయా..పెరుగుతాయా..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరల తగ్గుదలపై యూబీఎస్ సంచలన నివేదిక.. సామాన్యులకు పండగలాంటి వార్తే ఇది.. ఇన్వెస్టర్లకు మాత్రం..

బంగారం, వెండి ధరలు తగ్గాయి. తాజా రేట్లు ఇక్కడ చూడండి

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

Gold silver: బంగారం, వెండి కొనేవారికి అలర్ట్.. ఈ వారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే!



Click it and Unblock the Notifications