ముంబై: నిన్న రూ.400 వరకు తగ్గిన బంగారం ధరలు నేడు (మంగళవారం, డిసెంబర్ 15) స్వల్పంగా పెరిగాయి. ప్రారంభ సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్ రూ.100 వరకు పెరిగింది. దీంతో నిన్న రూ.49,000 దిగువకు వచ్చిన పసిడి, నేడు మళ్లీ ఆ మార్కును దాటింది. ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే రూ.7,200 తక్కువగా ఉంది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా దాదాపు రూ.200 పెరిగింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.79,000తో రూ.15,000కు పైగా తక్కువగా ఉంది. కరోనా వ్యాక్సీన్, వ్యాక్సినేషన్ ప్రకటన నేపథ్యంలో పసిడి ధరలు ఒడిదుడుకులు ఎధుర్కొంటున్నాయి.

రూ.100 పెరిగిన బంగారం
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.117.00 (0.24%) పెరిగి రూ.49,056 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,035.00 వద్ద ప్రారంభమై, రూ.49,060.00 గరిష్టాన్న, రూ.49,007.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఏప్రిల్ ఫ్యూచర్స్ కూడా రూ.49,000ను దాటింది.
ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ నిన్న (సోమవారం) రూ.398.00 (-0.81%) తగ్గి రూ.48926.00 వద్ద క్లోజ్ అయింది. ఏప్రిల్ ఫ్యూచర్స్ రూ.385.00 (-0.78%) క్షీణించి రూ.49000.00 వద్ద ముగిసింది.

వెండి ధర రూ.178 జంప్
సిల్వర్ మార్చి ఫ్యూచర్స్ రూ.178.00 (0.28%)క్షీణించి రూ.63,649.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.63,604.00 వద్ద ప్రారంభమై, రూ.63,693.00 వద్ద గరిష్టాన్ని, రూ.63,599.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మే ఫ్యూచర్స్ రూ.64,270 వద్ద ట్రేడ్ అయింది.
నిన్న సిల్వర్ మార్చి ఫ్యూచర్స్ కిలో రూ.313.00 (-0.49%) తగ్గి రూ.63422.00 వద్ద ముగిసింది. మే ఫ్యూచర్స్ 271.00 (-0.42%) తగ్గి రూ.64269.00 వద్ద క్లోజ్ అయింది.

అంతర్జాతీయ మార్కెట్లో అప్
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లోను పసిడి, వెండి ధరలు పెరిగాయి. ఔన్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 5.60 (+0.31%) డాలర్లు పెరిగి 1,837.70 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,828.55 - 1,838.40 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో బంగారం ధరలు 21.43 శాతం పెరిగాయి.
వెండి ఫ్యూచర్స్ 0.103 (+0.43%) డాలర్లు పెరిగి 24.150 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 23.942 - 24.170 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 41.3 శాతం పెరిగింది.
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 7, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

బంగారం ధరల తగ్గుదలపై యూబీఎస్ సంచలన నివేదిక.. సామాన్యులకు పండగలాంటి వార్తే ఇది.. ఇన్వెస్టర్లకు మాత్రం..

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Today Gold Silver Rate Live: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!



Click it and Unblock the Notifications