ముంబై: పసిడి ధర నిన్న భారీగా తగ్గినప్పటికీ, నేడు (గురువారం, 7 జనవరి) స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. నిన్న గోల్డ్ ఫ్యూచర్స్ రూ.1,230.00 (-2.38%) క్షీణించి రూ.50490.00 వద్ద ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ రూ.70వేల దిగువకు వచ్చింది. కిలో రూ.1,668.00 (-2.35%) క్షీణించి రూ.69190.00 వద్ద ముగిసింది. నేడు బంగారం రూ.250కి పైగా పెరిగి తిరిగి రూ.50,500ను క్రాస్ చేసింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.5500 తక్కువగా ఉంది.

బంగారం ధరలు స్వల్ప పెరుగుదల
నేడు (గురువారం, 7) ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 253.00 (0.50%) పెరిగి రూ.50762.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,740.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.50,807.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,731.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.5500 తక్కువగా ఉంది.
ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.246.00 (0.49%) పెరిగి రూ.50800.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,797.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.50,840.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,787.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి కాస్త జంప్
సిల్వర్ ఫ్యూచర్స్ స్వల్పంగా పెరిగింది. కిలో సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి 155.00 (0.22%) పెరిగి రూ.69572.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,585.00 వద్ద ప్రారంభమై, రూ.69,675.00 వద్ద గరిష్టాన్ని, రూ.69,508.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.229.00 (0.33%) పెరిగి రూ.70564.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.70,650.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.70,650.00 వద్ద గరిష్టాన్ని, రూ.70,483.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

బంగారం 1950 డాలర్లు క్రాస్
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్స్ 1950 డాలర్ల దిగువకు వచ్చింది. అయినప్పటికీ 1900 డాలర్ల పైనే ఉంది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 10.00
(+0.52%) డాలర్లు పెరిగి 1,918.60 డాలర్లు పలికింది. నేటి సెషన్లో 1,915.75 - 1,925.70 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 20% శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. ఔన్స్ ధర 0.148 (+0.55%) డాలర్లు తగ్గి 27.190 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 27.023 - 27.475 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 46.36 శాతం పెరిగింది.
More From GoodReturns

బంగారం ధరల పెరుగుదలపై UBS సంచలన నివేదిక.. పసిడి పెట్టుబడిదారులకు పండగే పండగ..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

బంగారం ధరలు ఈ వారం పెరుగుతాయా..తగ్గుతాయా.. ఆ మూడు ప్రపంచ బ్యాంకుల మీటింగ్‌పై నిపుణులు ఏం చెబుతున్నారంటే..

బంగారం ధరలు పెరిగాయి .. ఎంత పెరిగాయో తెలిస్తే పసిడి జోలికి పోరు.. మార్చి 11, బుధవారం ధరలు ఇవే..

Gold prices: యుద్ధం జరుగుతున్నా బంగారం ధరలు ఎందుకు పెరగడం లేదు? ఇన్వెస్టర్ల భయం ఇదే..

బంగారం ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన బ్యాంకింగ్ నిపుణులు.. పసిడి ర్యాలీ ఎంతవరకు అంటే..

బంగారం ధర రూ.1.70 లక్షలు.. వెండి ధర రూ.3 లక్షలకు పెరుగుతుందా? పసిడి ర్యాలీపై ఆర్థిక నిపుణలు ఏమంటున్నారంటే..

Today Gold Silver Rate Live: భారీగా పెరిగిన బంగారం ధరలు.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: బంగారం, వెండి ధరలు ఈ రోజు భారీగా పతనం.. ధరలు ఎలా ఉన్నాయో చెక్ చేయండి

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

Gold rates: పెరిగిందా.. తగ్గిందా? దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి గోల్డ్ రేట్ల వివరాలు ఇవే..



Click it and Unblock the Notifications