Gold prices today: బంగారం ధరలు మరింత తగ్గాయి, రూ.48,000 దిగువకు
బంగారం ధరలు నేడు అతి స్వల్పంగా తగ్గాయి. అంతకుముందు రూ.48,000 క్రాస్ చేసిన పసిడి ధరలు నిన్న భారీగా తగ్గి ఈ మార్కు దిగువకు వచ్చాయి. నేడు (ఏప్రిల్ 23, శుక్రవారం) స్థిరంగా లేదా అతి స్వల్పంగా తగ్గాయి. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే రూ.8500 తక్కువగా ఉంది. ఈ వారం ప్రారంభంలో రూ.70వేలు క్రాస్ చేసిన వెండి ఇప్పుడు రూ.69వేల దిగువకు వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి అతి స్వల్పంగా ెరగగా, సిల్వర్ స్వల్ప తగ్గుదలను నమోదు చేసింది.

స్థిరంగా బంగారం ధరలు
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో 10 గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి ఉదయం సెషన్లో రూ.35.00 (-0.07%) తగ్గి రూ.47737.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,885.00 ప్రారంభమైన ధర, రూ.47,940.00 గరిష్టాన్ని, రూ.47,651.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.25.00 (-0.05%) తగ్గి రూ.48040.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,160.00 ప్రారంభమైన ధర, రూ.48,160.00 గరిష్టాన్ని, రూ.47,950.00 కనిష్టాన్ని తాకింది.

వెండి రూ.357 డౌన్
మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.357.00 (-0.52%) తగ్గి రూ.68861.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,300.00 వద్ద ప్రారంభమై, రూ.69,300.00 గరిష్టాన్ని, రూ.68,750.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.378.00 (-0.54%) తగ్గి రూ.70010.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.70,557.00 ప్రారంభమైన ధర, రూ.70,557.00 వద్ద గరిష్టాన్ని, రూ.69,887.00 కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు పెరిగాయి. 1.05(+0.06%) డాలర్లు పెరిగి 1,783.05 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,782.75 - 1,789.70 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ స్వల్పంగా తగ్గింది. అయిన్ 26 డాలర్లకు పైనే ఉంది. 0.063 (-0.24%) డాలర్లు తగ్గి 26.117 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.067 - 26.258 డాలర్ల మధ్య కదలాడింది.


Click it and Unblock the Notifications