బంగారం ధరలు భారీగా తగ్గాయి. నేడు ఏకంగా రూ.1600కు పైగా క్షీణించాయి. తద్వారా రూ.48వేలకు పైగా ఉన్న గోల్డ్ ఫ్యూచర్స్ రూ.47,000 దిగువకు పతనమయ్యాయి. గతవారం రూ.49వేలతో పోలిస్తే రూ.2,000కు పైగా తగ్గింది. సిల్వర్ ఫ్యూచర్స్ దాదాపు రూ.4000 క్షీణించి, రూ.68,000 దిగువకు పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ దాదాపు 100 డాలర్ల వరకు పడిపోయింది. సిల్వర్ ఫ్యూచర్స్ 26 డాలర్ల దిగువకు చేరుకుంది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే రూ.9400 తక్కువగా ఉంది.

భారీగా తగ్గిన బంగారం ధర
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి సాయంత్రం సెషన్లో రూ.1,612.00 (3.32%) తగ్గి రూ.46894.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,250.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,250.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.46,744.00 కనిష్టాన్ని తాకింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.1,672.00 (3.43%) తగ్గి రూ.47140.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,137.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,150.00 గరిష్టాన్ని, రూ.47,032.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.3785 తగ్గిన వెండి
జూలై సిల్వర్ ఫ్యూచర్స్ సాయంత్రం సెషన్లో రూ.3,785.00 (5.30%) తగ్గి రూ.67683.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.71,000.00 వద్ద ప్రారంభమై, రూ.71,000.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.67,526.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.3,901.00 (5.37%) తగ్గి రూ.68720.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.71,500.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.71,569.00 గరిష్టాన్ని, రూ.68,567.00 కనిష్టాన్ని తాకింది

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం నేడు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 88.70 (4.77%) డాలర్లు తగ్గి 1,772.62 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,768.00 - 1,826.20 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. 1.914 (6.88%) డాలర్లు తగ్గి 25.898 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.823 - 27.317 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..



Click it and Unblock the Notifications