ఏడాది కనిష్టానికి బంగారం ధరలు, ఆల్‌టైం గరిష్టంతో రూ.11,700 తక్కువ
బంగారం ధరలు నేడు (మార్చి 26, శుక్రవారం) దాదాపు స్థిరంగా ఉన్నాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్‌లో ఉదయం సెషన్లో రూ.100 వరకు పసిడి ధరలు ఆ ధరలు కాస్త 20 క్షీణించాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు అతి స్వల్పంగా తగ్గగా, అంతర్జాతీయ మార్కెట్లో ఈ రెండు ఖరీదైన లోహాలు పెరిగాయి. వివిధ నగరాల్లో రిటైల్ మార్కెట్లో ధరలు నేడు తగ్గాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.40,950, 24 క్యారెట్ల పసిడి రూ.44,710 వద్ద ట్రేడ్ అయింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.41,700, 24 క్యారెట్ల బంారం రూ.45,490గా ఉంది.
గోల్డ్ ఫ్యూచర్ నేడు సాయంత్రం సెషన్‌లో స్థిరంగా ఉంది. ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.21.00 (0.29%) తగ్గి రూ.44674.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.44,635.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.44,788.00 వద్ద గరిష్టాన్ని, రూ.44,441.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.11,700 తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ స్వల్పంగా పెరిగింది. రూ.52.00 (0.12%) పెరిగి రూ.44164.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.45,107.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.45231.00 వద్ద గరిష్టాన్ని, రూ.44,900.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

సిల్వర్ ఫ్యూచర్స్ స్వల్పంగా తగ్గింది. మే సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.50.00 (0.08%) తగ్గి రూ.64819.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.64,975.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.65,244.00 వద్ద గరిష్టాన్ని, రూ.64,516.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. కిలో రూ.37.00 (0.06%) తగ్గి రూ.65849.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.65,952 వద్ద ప్రారంభమైన ధర, రూ.66,250 వద్ద గరిష్టాన్ని, రూ.65,451 వద్ద కనిష్టాన్ని తాకింది.
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 6.10 (0.35%) డాలర్లు పెరిగి 1,731.35 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,719.40 - 1,735.35 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ 25 డాలర్ల వద్దనే కదలాడుతోంది. ఔన్స్ ధర 0.015 (+0.06%) డాలర్లు పెరిగి 25.062 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 24.920 - 25.325 డాలర్ల మధ్య కదలాడింది.


Click it and Unblock the Notifications