For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold prices today: 3 నెలల కనిష్టానికి బంగారం ధరలు, వెండి ధరలు డ్రాప్

|

బంగారం ధరలు క్రితం సెషన్‌లో స్వల్పంగా పెరిగినప్పటికీ, నేడు తగ్గుముఖం పట్టాయి. ఎంసీఎక్స్‌లో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.34 తగ్గి రూ.50,184 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.69 తగ్గి రూ.50,322 వద్ద ట్రేడ్ అయింది. నిన్న మాత్రం ఎంసీఎక్స్‌లో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.105 పెరిగి రూ.50,278 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.109 పెరిగి రూ.50,432 వద్ద ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్ అయితే తగ్గింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.399 తగ్గి రూ.60,757 వద్ద, సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.450 తగ్గి రూ.61,446 వద్ద ముగిసింది.

అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1 డాలర్ పెరిగి 1814 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.034 డాలర్లు పెరిగి 21.511 వద్ద ట్రేడ్ అయింది. ఏడాదిలో గోల్డ్ ఫ్యూచర్ 3 శాతం తగ్గగా, సిల్వర్ ధర 25 శాతం తగ్గింది. కామెక్స్‌లో పసిడి ఆల్ టైమ్ గరిష్టం 2075 డాలర్లతో 260 డాలర్లు తక్కువగా ఉంది. ఎంసీఎక్స్ ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.6000 వరకు తక్కువగా ఉంది.

Gold prices today near lowest in 3 months, silver rates drop

బంగారం ధరలు ఇటీవల భారీగా తగ్గాయి. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రెండు నెలల క్రితం రూ.55,500 క్రాస్ చేశాయి. కానీ యుద్ధ ప్రభావం తగ్గిన తర్వాత రూ.50,000 స్థాయికి వచ్చాయి. ఇటీవల ద్రవ్యోల్భణ ఆందోళనలు, ఫెడ్ వడ్డీ రేటు పెంపు వంటి అంశాలు ప్రభావం చూపాయి. ఇటీవల ఓ సమయంలో రూ.50,000 దిగువకు పడిపోయిన గోల్డ్ ఫ్యూచర్స్ ఇప్పుడు ఈ మార్కు పైన ఉంది.

English summary

Gold prices today: 3 నెలల కనిష్టానికి బంగారం ధరలు, వెండి ధరలు డ్రాప్ | Gold prices today near lowest in 3 months, silver rates drop

Gold and silver rates today edged lower in Indian markets, tracking subdued global cues. On MCX, gold futures were down 0.13% to ₹50,158 per 10 gram while silver struggled at ₹60,697 per kg.
Story first published: Thursday, May 19, 2022, 10:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X