2 రోజులు భారీగా తగ్గి మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు: రూ.51,000కు దిగువన
ముంబై: రెండు రోజులపాటు తగ్గిన పసిడి ధరలు శుక్రవారం (అక్టోబర్ 30) స్వల్పంగా పెరిగాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో నేటి ప్రారంభ సెషన్‌లో 10 గ్రాముల డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.150(0.30 శాతం) పెరిగి రూ.50,432 పలికింది. రూ.50,465 వద్ద ప్రారంభమై, రూ.50,525 వద్ద గరిష్టాన్ని, రూ.50,353 వద్ద కనిష్టాన్ని తాకింది. బంగారం ధర గత రెండు రోజుల్లో రూ.550కి పైగా తగ్గిన విషయం తెలిసిందే. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.5,700కు పైగా తక్కువ ఉంది.

ధర పెరిగింది కానీ..
డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ దారిలోనే ఫిబ్రవరి ఫ్యూచర్స్ ధర పెరిగింది. 10 గ్రాముల పసిడి రూ.50,510 వద్ద ప్రారంభం కాగా, రూ.50,570 వద్ద గరిష్టాన్ని, రూ.50,450 వద్ద కనిష్టాన్ని తాకింది. రూ.186 (0.37 శాతం) పెరిగి రూ.50,550 వద్ద ట్రేడ్ అయింది. పండుగ సమయంలో పసిడి ధరలు రూ.51వేల దిగువకు చేరుకోవడం కొనుగోలుదారులకు కాస్త గుడ్ న్యూస్. ఎనిమిది నెలల క్రితంతో పోలిస్తే ధరలు భారీగానే పెరిగాయి. కానీ నెల రోజులకు పైగా దాదాపు రూ.49వేల నుండి రూ.51వేల మధ్య కాస్త స్థిరంగా కనిపించాయి.

వెండి ధర అప్
సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్స్ స్వల్పంగా పెరిగింది. రూ.38 (0.06 శాతం) పెరిగి కిలో రూ.60210 పలికింది. రూ.60,557 వద్ద ప్రారంభమై రూ.60,665 వద్ద గరిష్టాన్ని, రూ.59,918 వద్ద కనిష్టాన్ని తాకింది.
మార్చి ఫ్యూచర్స్ రూ.46(0.07 శాతం) పెరిగి రూ.61,780 పలికింది. రూ.62,150 వద్ద ప్రారంభమై, రూ.62,208 వద్ద గరిష్టాన్ని, రూ.61,549 వద్ద కనిష్టాన్ని తాకింది. రెండు రోజుల క్రితం పసిడి ఏకంగా రూ.2వేలకు పైగా క్షీణించిన విషయం తెలిసిందే. దీంతో రూ.63వేల నుండి రూ.62వేల దిగువకు వచ్చింది.

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర స్వల్పంగా పెరిగింది. ఔన్స్ డిసెంబర్ ఫ్యూచర్ గోల్డ్ 0.13 శాతం పెరిగి 1,870.40 డాలర్లు పలికింది. క్రితం సెషన్‌లో 1,868.00 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. నేడు 1,864.20 - 1,878.30 డాలర్ల మధ్య ట్రేడ్ అవుతోంది. ఈ ఏడాది అంతర్జాతీయ మార్కెట్లో పసిడి 22 శాతానికి పైగా పెరిగింది.
సిల్వర్ ఫ్యూచర్ దాదాపు స్థిరంగా ఉంది. 0.04 శాతం క్షీణించి 23.350 డాలర్ల వద్ద పలికింది. 23.230 - 23.648 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 23.360 డాలర్ల వద్ద ముగిసింది. 2020లో వెండి 29 శాతం పెరిగింది.


Click it and Unblock the Notifications